cancer victims
-
క్యాన్సర్ బాధితులకు సంపూర్ణ వైద్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోనే పూర్తిస్థాయి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నలుమూలలా నాలుగు అధునాతన క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఏడాదిలో పూర్తిస్థాయిలో క్యాన్సర్ వైద్యం అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇప్పటికే ఆస్పత్రులు ఉన్నప్పటికీ అరకొర సేవలే అందుతున్నాయి. విజయవాడ సమీపంలోని చినకాకానిలో గల క్యాన్సర్ ఆస్పత్రి రెండు దశాబ్ధాలుగా నిరుపయోగంగా ఉంది. ఈ మూడింటి స్థానంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర వైద్యం అందించేలా ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు కర్నూలులో మరో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటవుతోంది. ప్రతి జిల్లాకు అందుబాటులో ఉండేలా.. ప్రతి జిల్లాకు అందుబాటులో ఉండేలా రాష్ట్రం నలుమూలలా అందుబాటులో ఉండేలా అత్యాధునిక సదుపాయాలతో సమగ్ర ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల వారికోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో పూర్తిస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటవుతోంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారి కోసం విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జిల్లా చినకాకాని క్యాన్సర్ సెంటర్ పూర్తిస్థాయి ఆస్పత్రిగా మారబోతోంది. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల వారి కోసం తిరుపతి స్విమ్స్‌లో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కాబోతోంది. వీటితో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల వారికి కర్నూలులో కూడా మరో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలతో నిర్మిస్తున్న ఈ క్యాన్సర్ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే పూర్తిస్థాయి వైద్యం అందనుంది. ఒక్కో ఆస్పత్రిలో 600 పడకలు మెడికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ విభాగాలతో ఒక్కో క్యాన్సర్ ఆస్పత్రిలో 600 పడకలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న ఈ క్యాన్సర్ ఆస్పత్రుల్లో ఒక్కో విభాగానికి 10 యూనిట్ల (యూనిట్‌కు 20 పడకలు) చొప్పున 200 పడకలు అందుబాటులోకి తెస్తారు. ఇలా మూడు విభాగాల్లో 200 చొప్పున మొత్తం 600 పడకలు సమకూరతాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులను అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే రూ.300 కోట్ల కేటాయింపు ఈ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత నిధులను కూడా కేటాయించింది. కర్నూలులో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రికి రూ.150 కోట్లు కేటాయించగా.. విశాఖపట్నం, చినకాకాని, తిరుపతిలలో ఏర్పాటయ్యే ఒక్కో ఆస్పత్రికి రూ.50 కోట్ల చొప్పున రూ.150 కోట్లు కేటాయించింది. నిపుణుల సూచన మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం ఒక ప్రణాళిక సైతం సిద్ధం చేశారు. ఏడాదిలో అందుబాటులోకి.. కొత్తగా ఏర్పాటవుతున్న క్యాన్సర్ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్యసేవలు ఏడాదిలో అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 80 నుంచి 100 పడకలు అందుబాటులో ఉన్నాయి. చినకాకానిలో 30 పడకలు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో తొలుత కనీసం 300 పడకలకు పెంచి ఏడాదిలో పూర్తిస్థాయి సేవలు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. రెండేళ్లలో ప్రతి ఆస్పత్రిలో 600 చొప్పున పడకలను అందుబాటులోకి తెస్తాం. రాష్ట్ర ప్రజలు క్యాన్సర్ వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే సేవలందించేలా సౌకర్యాలు కల్పిస్తాం. – డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, డీఎంఈ -
నా పేరు..... నాకు కేన్సర్!
సాక్షి, హైదరాబాద్: ఆ పేరు ఓ తల్లిది కావచ్చు.. ఓ చెల్లిది కావచ్చు.. ఓ భార్యదీ కావొచ్చు...రాష్ట్రంలో కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా మారుతోంది. కేన్సర్ చికిత్స తీసుకునే వారిలో 90 శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు రాష్ట్రంలోని వందలాది ఆస్పత్రుల ద్వారా కేన్సర్‌కు చికిత్స అందిస్తోంది. కేన్సర్ చికిత్స పొందుతున్న వారికి సంబంధించి ఆరోగ్యశ్రీ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గణాంకాల ప్రకారం ఏటా సగటున 6 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో అధి క శాతం మహిళలే ఉంటు న్నారు. గర్భాశయ కేన్సర్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. రొమ్ము కేన్సర్ బాధి తులు గణనీయంగా పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని మహిళలే ఎక్కువగా కేన్సర్ బారిన పడుతున్నారు. హైదరాబాద్‌లో రొమ్ము కేన్సర్ రోగులు ఎక్కువగా నమో దవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గర్భాశయ కేన్సర్ రోగులు ఎక్కువగా ఉంటున్నారు. నోటి కేన్సర్ రోగులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికంగా నమోదవుతున్నారు. అవగాహనా రాహిత్యమే కారణం.. అవగాహనా రాహిత్యమే కేన్సర్ తీవ్రతకు ప్రధాన కారణ మని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసిం ది. భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనే ఏటా 14 లక్షల మంది కేన్సర్‌తో మరణిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ పరం గా కేన్సర్ అవగాహనా కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే బాధితులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కేన్సర్ రోగుల్లో 70% మంది 70 ఏళ్లలోపే మరణిస్తున్నారని తెలిపింది. పొగాకు, మద్యపానం వినియో గాన్ని పూర్తిస్థాయిలో అరికడితే పరిస్థితి మెరుగవుతుందని సూచించింది. సాధారణంగా కేన్సర్ తీవ్రస్థాయికి చేరుకు న్నాక కానీ భారత్‌లో రోగులు గుర్తించట్లేదని పేర్కొంది. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. చివరిదశలో ఉన్నప్పుడు ఆస్పత్రులకు వచ్చే వారిసంఖ్య ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా చికిత్స పెద్దగా ప్రభావం చూప ట్లేదని ఆరోగ్యశ్రీ ట్రస్టు గణాంకాలు చెబుతున్నాయి. గర్భాశయ కేన్సర్‌కు కారణాలు.. హ్యూమన్పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ). పౌష్టికాహార లోపం బాల్యవివాహాలు, 18 ఏళ్లలోపు కాన్పులు జరగడం. మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, çసుఖవ్యాధుల తీవ్రత. రొమ్ము కేన్సర్‌కు కారణాలు.. ఎక్కువసార్లు జన్యు పరంగా రొమ్ము కేన్సర్ వస్తోంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, సంతానలేమి, పిల్లలకు తల్లి పాలు ఇవ్వకపోవడం కారణం. రాష్ట్రంలో కేన్సర్ బాధితులు గర్భాశయ 81,361 రొమ్ము 55,965 అండాశయం 11,257 జీర్ణకోశం 6,527 పెద్దపేగు 6,999 ఎముకలు 5,351 కండరాలు 4,898 అన్నవాహిక 5,062 ఊపిరితిత్తులు 3,445 రక్తం 4,018 -
గంటలో 75 మందికి గుండు!
యూకేకు చెందిన క్షురకుడు శామ్ ర్యాన్ గంటలో 75 మందికి గుండు కొట్టేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేశాడు. రికార్డుల పిచ్చికాకపోతే.. గుండు కొట్టించుకున్నవాళ్ల పరిస్థితి ఏంటో పాపం! అని విచారించాల్సిన పనిలేదు. గుండు కొట్టడంలో మనోడు ఎక్స్పర్ట్. ఇంతకీ ర్యాన్ ఈ పని చేయడానికి కారణమేంటో తెలుసా..? అతని స్నేహితురాలి మరణం! అవును.. క్యాన్సర్‌తో చనిపోయిన క్లేర్ ఎల్లిస్ కోసమే ఈ గుండు గీత కార్యక్రమం! రెగ్యులర్‌గా తన సెలూన్‌కి వచ్చే ఎల్లిస్‌కు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె కీమోథెరపీ చేయించుకోవాల్సివచ్చింది. ఈ కారణంగా జుట్టు కోల్పోయిన ఆమె.. తర్వాత పూర్తిగా సెలూన్‌కు రావడం మానేసింది. ఆరోగ్యం క్షీణించిన ఎల్లిస్ కొద్దిరోజులకే మరణించింది. ఈ వార్త తెలుసుకున్న శామ్ ర్యాన్ ఆమె జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ముందుగా ఓ పెద్ద పార్కుని ఎంచుకున్న ఆయన.. 75 మందికి ఊదారంగు టీషర్టులు తొడిగి, వరుసగా కూర్చోబెట్టి పనికానిచ్చేశాడు. ఒక్కోగుండుకు సగటున 48 సెకండ్లు తీసుకున్న ర్యాన్, గంటలోనే మొత్తాన్నీ ఫినిష్ చేసేశాడు. వారి నుంచి సేకరించిన నగదును ఓ స్వచ్ఛంద సంస్థకు అందించాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న గిన్నిస్ ప్రతినిధులు ఆయనకు ఇటీవలే సర్టిఫికెట్ కూడా అందించారు.