
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పోరుకు జోయాలుక్కాస్ ‘థింక్ పింక్’
ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోయాలుక్కాస్ వరుసగా ఐదో సంవ త్సరం కూడా ‘థింక్ పింక్’ కార్యక్రమం కింద బ్రెస్ట్ క్యాన్సర్‌పై
దుబాయ్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోయాలుక్కాస్ వరుసగా ఐదో సంవ త్సరం కూడా ‘థింక్ పింక్’ కార్యక్రమం కింద బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహనను కల్పించనుంది. దీని కోసం అక్టోబర్ నెలలో ‘చెక్ ఇట్, బీట్ ఇట్’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అస్టర్ డీఎం హెల్త్‌కేర్ సహకారాన్ని అందిస్తోందని జోయాలుక్కాస్ గ్రూప్ డెరైక్టర్ సోనియా జాన్‌పాల్ తెలిపారు. థింక్ పింక్ కార్యక్రమం వెనుక ఎలాంటి లాభపేక్ష లేదని, సేవాభావంతో చేస్తున్నామని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన తీసుకురావడానికి జోయాలుక్కాస్ గత నాలుగేళ్లుగా చేస్తున్న కృషి అభినందనీయమని అస్టర్ డీఎం హెల్త్‌కేర్ డెరైక్టర్ అలిషా మూపెన్ ఈ సందర్భంగా తెలిపారు.