Actress Hamsa Nandini Reveals About Her Breast Cancer, Post Viral - Sakshi
Sakshi News home page

Hamsa Nandini: గ్రేడ్‌ 3 క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి హంసానందిని

Published Mon, Dec 20 2021 11:08 AM | Last Updated on Mon, Dec 20 2021 8:10 PM

Actress Hamsa Nandini Reveals About Her Breast Cancer, Post Viral - Sakshi

Actress Hamsa Nandini Revealed She Suffer With Breast Cancer: నటి హంసానందిని క్యాన్సర్‌ బారిన పడ్డారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని ధీమా వ్యక్తంచేశారు. తన జీవితంలో కాలం ఏవిధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదన్నారు హంస.

చదవండి: Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్‌ సాంగ్‌ ట్రోల్స్‌పై స్పందించిన సామ్‌

18 ఏళ్ల క్రితం క్యాన్సర్‌తో తన తల్లి కన్నుమూశారని.. నాటి నుంచి అదే భయంతో జీవిస్తున్నానని తెలిపారు. జన్యుపరమైన క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు తాజాగా నిర్ధారించారని వివరించారు. ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నానని.. మరో ఏడు చేయించుకోవాల్సి ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తానని అభిమానులకు తెలిపారు. అంతేగాక క్యాన్సర్‌ను జయించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తానంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది. కాగా ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన హంసానందిని.. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో కనువిందు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement