Hamsa Nandini Cancer Photos: Actress Hamsa Nandini An Inspiring Photoshoot Amid Cancer Battle - Sakshi
Sakshi News home page

Hamsa Nandini: ఇప్పటికే 9 సార్లు కీమోథెరపీ.. ఇంకా 7 సార్లు...

Published Sat, Jan 22 2022 5:28 AM | Last Updated on Sat, Jan 22 2022 8:32 AM

Actress Hamsa Nandini An Inspiring Photoshoot Amid Cancer Battle - Sakshi

ఫొటోలు భావాలు చెబుతాయా? అంటే కొన్ని ఫొటోలు చెబుతాయి. అందుకు తాజా ఉదాహరణ ఇక్కడ కనిపిస్తున్న హంసా నందిని ఫొటో. ఇటీవల హంస చేయించుకున్న ఫొటోషూట్‌ ఇది. మామూలుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవాళ్లు, సినిమాలో గెటప్‌ ఎలా ఉంటుందో ముందే చూసుకోవాలనుకునేవాళ్లు.. ఇలా రకరకాల కారణాలతో ఫొటోషూట్‌ చేయిస్తారు. అయితే హంసా నందిని తాజా ఫొటోషూట్‌కి ఇవేవీ కారణాలు కావని ఊహించే ఉంటారు.

ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు రొమ్ము కేన్సర్‌కి సంబంధించిన చికిత్స జరుగుతోంది. తాను కేన్సర్‌ బారిన పడిన విషయాన్ని గత ఏడాది డిసెంబరులో హంస సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఫొటోషూట్‌ చేయించుకున్నారు. గుండుతో ఉన్న ఈ ఫొటోలో హంస ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టయిలిస్ట్‌గా చేసిన అమీ పటేల్‌ అంటున్నారు.

‘మీరు (హంసా నందిని) చాలా అందంగా కనబడుతున్నారు. మీ ఫొటో ‘బలం, నమ్మకం, అందాన్ని’ ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు కేన్సర్‌తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీన్నుంచి విజయవంతంగా, మరింత అందంగా బయటికొస్తారు. మేమంతా మీ వెంటే ఉంటాం’ అని అమీ పటేల్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గత డిసెంబరు నాటికే తొమ్మిది విడతల కీమోథెరపీ పూర్తయిందని, ఇంకా ఏడుసార్లు చేయించుకోవాలనీ హంస పేర్కొన్నారు. యాక్టింగ్‌ అనేది నా ఫస్ట్‌ లవ్‌... ఇంకా చాలా బలంగా, మెరుగ్గా తిరిగి వస్తానని కూడా అన్నారు. ఆమె నమ్మకం నిజమవుతుందని ఈ ఫొటో స్పష్టం చేస్తోంది కదూ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement