బెంగళూరు టు హైదరాబాద్
మానవపాడు : బ్రెస్ట్‌క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి బెంగళూరుకు చెందిన ఇద్దరు స్నేహితులు ముందుకు కదిలారు. రోజుకు 60 కిలోమీటర్ల పొడవునా పరుగు తీస్తూ దారివెంట బ్రెస్ట్‌క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 6వ తేదీన 10వేల మందితో హైదరాబాద్‌లోని నక్లెస్‌రోడ్డుపై 10 కేవీ రన్ జరుగనుందని, అందులో పాల్గొనేందుకు తాము పరుగుతీస్తున్నట్లు బెంగళూరుకు చెందిన గిరధర్ కామంత్, స్పూర్తి సీతమ్మలు తెలిపారు. మంగళవారం కర్నూలు మీదుగా జాతీయరహదారిపైనున్న మానవపాడుకు చేరుకోగా ‘సాక్షి’ వారిని పలకరించింది.