
కేన్సర్ మహమ్మారిని నిర్ధారించుకునేందుకు ఎంతో ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీతో దీన్ని కారు చౌక చేసేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. మనిషి వెంట్రుక మందమంత చిన్న చిన్న కాలువల్లాంటి నిర్మాణాలతో కూడిన ల్యాబ్ ఆన్ చిప్ పరికరాలతో కేన్సర్‌ను సులువుగా గుర్తించవచ్చునని సిప్రియాన్ ఇలిస్క్యూ అనే రొమేనియన్ శాస్త్రవేత్త చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ ల్యాబ్ ఆన్ చిప్‌లు ఒక్కో వ్యక్తికి తగిన వైద్యం అందించేందుకు కూడా ఉపయోగపడతాయని చెప్పారు. మైక్రోఫ్లూయిడిక్స్ అభివద్ధిపై బయో మైక్రోఫ్లూయిడిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని కణాలను వేరుచేసి ఈ చిప్‌లలోకి పంపి... కేన్సర్ మందులను వాటిపై ప్రయోగించవచ్చునని... తద్వారా అవి ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయా మందులను వాడకం మొదలుపెట్టవచ్చునని సిప్రియాన్ వివరిస్తున్నారు. ఈ ల్యాబ్ ఆన్ చిప్స్ రక్తం, లాలాజలం, స్వేదం, మూత్రం వంటి పలు జీవ ద్రవాలను విశ్లేషించగలదని.. కేన్సర్ కణితులు విడుదల చేసే నిర్దిష్ట కణాలు, ప్రొటీన్లు, కణజాలాలను గుర్తించగలదని వివరించారు. లిక్విడ్ బయాప్సీ అని పిలిచే ఈ పద్ధతి వల్ల రోగికి ఇబ్బందులు తగ్గడమే కాకుండా.. శరీరం మారుమూలల్లోని కణితులను కూడా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కేన్సర్ ఏ అవయవంలో మొదలైంది.. ఇతర అవయవాలకు విస్తరించిందా? లేదా? అన్నది కూడా ఈ చిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment