
రొమ్ము కేన్సర్‌కు ‘యోగా’తో మేలు
ఐదు వేల సంవత్సరాల క్రితమే భారతీయ వైద్య విధానాల్లో మంచి ఫలితాలు చూపించిన యోగా.. రొమ్ము కేన్సర్ బారిన పడ్డ మహిళలకూ బాగా పనిచేస్తుందని ఓ సరికొత్త అధ్యయనం వెల్లడించింది.
వాషింగ్టన్: ఐదు వేల సంవత్సరాల క్రితమే భారతీయ వైద్య విధానాల్లో మంచి ఫలితాలు చూపించిన యోగా.. రొమ్ము కేన్సర్ బారిన పడ్డ మహిళలకూ బాగా పనిచేస్తుందని ఓ సరికొత్త అధ్యయనం వెల్లడించింది. రొమ్ము కేన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ చేయించుకుంటున్న మహిళలు యోగా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.
వీరు తేలికపాటి యోగా ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్‌ను నియంత్రించవచ్చని తమ అధ్యయనంలో తేలిందన్నారు. శ్వాస నియంత్రణ, ధ్యానం, ఇతర ఉపశమన విధానాలను పాటించడం వల్ల వీరు దైనందిన కార్యకలాపాలను సులువుగా చేసుకోవచ్చని, దీంతోపాటు ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. ట్రీట్‌మెంట్ సమయంలో యోగా చేసినవారు మంచి ఫలితాలు సాధించారని పరిశోధకులు చెప్పారు. మనసుకు, శరీరానికి ఉన్న సంబంధాలను శాస్త్రీయంగా అంచనా వేసే ఎండీ అండర్సన్ కేన్సర్ సెంటర్ (యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్) ఈ అధ్యయనం చేసింది. దీన్ని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించారు.