రొమ్ము క్యాన్సర్‌పై యుద్ధం
ఖైరతాబాద్: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు యునెటైడ్ సిస్టర్స్ ఫౌండేషన్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ‘పింక్‌థాన్’ పేరుతో రన్ నిర్వహించారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో సాగిన రన్‌లో సుమారు ఏడు వేల మంది పాల్గొన్నారు. గతంలో ముంబ యి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి మహా నగరాల్లో ఈ తరహా మారథాన్ నిర్వహించామని
తొలిసారి సిటీలో ఏర్పాటు చేసినట్టు ఎస్‌బీఐ సీజీఎం సి.ఆర్. శశికుమార్ తెలిపారు. రన్‌లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రన్‌లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పి.రఘురామ్, ఫిట్‌నెస్ నిపుణుడు సోమన్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.