డిసెంబర్ 4న అమరావతి గోయింగ్ పింక్«థాన్
విజయవాడ (లబ్బీపేట) : మహిళల ఆరోగ్యం, రొమ్ము క్యాన్సర్ల పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో డిసెంబర్ 4వ తేదీ అమరావతి గోయింగ్ పింక్‌థాన్‌ను నిర్వహించనున్నట్లు యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మిలింద సోమన్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఈ పింక్‌థాన్‌ను మూడు కేటగిరీలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం మొగల్రాజపురంలోని ది ఫుడ్లాంజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి గోయింగ్ ఫింక్‌థాన్ వివరాలను వెల్లడించారు. యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్, ఎరెనా ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పింక్‌థాన్‌లో పలు సంస్థలు భాగస్వాములు కానున్నట్లు వివరించారు. ఈ పింక్‌థాన్ 10 కి.మీ., 5 కి.మీ., 3 కి.మీ.లు ఇలా మూడు కేటగిరీలుగా నిర్వహించనున్నామని చెప్పారు. ఈ పరుగులో 3 నుంచి 4 వేల మంది మహిళలు పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ మంజుభార్గవి, యునైటెడ్ సిస్టర్స్ ప్రతినిధి నీలిమ, డాక్టర్ శైలజ, రమేష్ హాస్పటల్స్‌కు చెందిన డాక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.