
బీరు మంచిదో, చెడదో చెప్పే విషయం కాదిది. క్యాన్సర్‌కు కీమోథెరపీ చేయించుకుంటున్న మహిళల కోసం చెకోస్లొవేకియాలోని ‘బ్రెస్ట్ క్యాన్సర్ ఛారిటీ’ సంస్థ ఒకటి ప్రత్యేకమైన బీరును తయారు చేయించింది. అయితే ఇది మహిళా పేషెంట్‌లు అందరి కోసమూ కాదు. బీరు తాగాలని ఆశపడుతున్న కొందరి కోసమే. మామూలు బీర్లు చేదుగా ఉంటాయి. వీరి బీర్లు తియ్యగా ఉంటాయి. ప్రస్తుతం ఇవి అక్కడి క్యాన్సర్ ఆసుపత్రులలో రోగులకు ఉచితంగా అందిస్తున్నారు. బయట మందుల షాపులలో కూడా కొద్దిపాటి ధరకు అందుబాటులో ఉన్నాయి.
ఇంతకీ ఈ బీరులో ఏమేమి ఉంటాయి. ఆల్కాహాల్ అయితే ఉండదు. ఇక ఉండేవి ఏంటంటే విటమిన్లు, మినరల్స్, కొంచెం ఎక్కువస్థాయిలో డి విటమిన్, పొటాషియం ఉంటాయి. కడుపు నిండా తిన్నా ఒంటికి పోషకాలు పట్టని వారికి ఈ బీరు ప్రత్యామ్నాయం అని అక్కడి డాక్టర్లు సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. అంతేకాదు, కీమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోయే సమస్యకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుందట. బీరు పేరు ‘మమ్మా బీర్’. మరి ఇది మగవాళ్లకు అమ్మరా? ఎందుకు అమ్మరండీ.. కొనరుగానీ.
Comments
Please login to add a commentAdd a comment