
కేన్సర్‌ను జయిద్దాం..
బంజారాహిల్స్: ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్, కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ సీజేస్, భారతీయ రొమ్ము కేన్సర్ వైద్య నిపుణుల సంఘం సంయుక్తాధ్వర్యంలో రొమ్ము కేన్సర్‌పై ఆదివారం అవగాహన వాక్ నిర్వహించారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ వాక్‌ను సినీ నటి రెజీనా, కేన్సర్‌ను జయించిన మధుమిత చక్రవర్తి జెండా ఊపి ప్రారంభించారు. కేన్సర్‌ను జయించిన సుమారు మూడువేల మంది, వారి కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు.
కేన్సర్‌ను జయించిన వారిని గౌరవించడం, వీరి స్ఫూర్తిగా కేన్సర్ బాధితుల్లో పోరాడేతత్వాన్ని రగిలించడం... ఈ వాక్ ముఖ్య ఉద్దేశమని ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ సీఈఓ పి.రఘురాం తెలిపారు. వాక్‌లో కిమ్స్ చైర్మన్ బి.కృష్ణయ్య, డాక్టర్ బి.భాస్కర్‌రావు, ఎస్‌బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్, సింక్రోని ఫైనాన్షియల్ బిజినెస్ లీడర్ ఫైసలుద్దీన్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్, ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి చైర్మన్ రమేష్ ప్రసాద్ పాల్గొన్నారు.