
బాలీవుడ్ నటి హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడింది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం క్యాన్సర్ మూడో స్టేజీలో ఉందని త్వరలోనే ఈ మహమ్మారిపై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

కాగా హీనా ఖాన్.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో పాపులర్ అయింది. హిందీ బిగ్‌బాస్ 11 వ సీజన్‌తో జనాలకు దగ్గరైంది.

నాగిన్ 5 సీరియల్‌లోనూ ఆకట్టుకుంది.

ఇటీవలే షిండా షిండా.. నో పాపా అనే పంజాబీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లు రాబట్టింది.







