బిఎస్‌ఇ అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ నెలకోసారి బిఎస్‌ఈ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా పసిగట్టి, వ్యాధి ముదరకముందే చికిత్స చేయించుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
1.అద్దం ముందు నిలబడి చేతులను తల వెనకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని గమనించాలి.
2.చేతులను నడుము మీద పెట్టి, భుజాలను లోపలికి కుదించి, మోచేతులను దేహం ముందు వైపుకు తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు బ్రెస్ట్స్ కదులుతాయి, ఆ కదలికలను బట్టి కండరాల్లో మార్పులు ఉన్నాయేమో గమనించాలి.
3.రొమ్ముల పై భాగం, చుట్టూ, చంకల కింద కూడా నొక్కి చూడాలి.
4.ఇప్పుడు నిపుల్స్ మెల్లగా నొక్కి పాలలాగ లేదా నీటిలాగ ద్రవం విడుదలవుతుందేమో చూడాలి.
5.తర్వాత వెల్లకిలా పడుకుని చేతివేళ్లతో బ్రెస్ట్‌ను తాకుతూ పరీక్షించుకోవాలి. పడుకున్నప్పుడు తలకింద దిండు ఉండకూడదు. మడతపెట్టిన టవల్‌ను భుజాల కింద ఉంచుకోవాలి. ఈ స్థితిలో రొమ్ముల కండరాలు పక్కటెముకల మీద విస్తరించినట్లు పరుచుకుంటాయి. దాంతో లోపల చిన్న గడ్డలాంటిది ఉన్నా వెంటనే తెలిసిపోతుంది.
ఎప్పుడు పరీక్షించుకోవాలి?
రుతుక్రమం పూర్తయిన తొలిరోజున చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సూచిక అయి ఉండవచ్చు. కాబట్టి ఓసారి డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవాలి.
అలాగే...
నిపుల్స్ నుంచి పాలలాగ ద్రవం విడుదలవుతున్నా, రొమ్ములలో వాపును గమనించినా, చర్మం మీద దురద పెడుతున్నా, బుడిపెలాంటిది ఏర్పడినా, నిపుల్స్‌లో నొప్పి, ఎరుపుదనం, లోపలికి ముడుచుకుపోవడం వంటి లక్షణాలను గమనించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇలా!
Published Tue, Jan 21 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement