బిడ్డను కనకుంటే... క్యాన్సర్ వస్తుందా?! | Breast cancer in women | Sakshi
Sakshi News home page

బిడ్డను కనకుంటే... క్యాన్సర్ వస్తుందా?!

Published Sat, Mar 26 2016 9:19 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

బిడ్డను కనకుంటే... క్యాన్సర్ వస్తుందా?!

బిడ్డను కనకుంటే... క్యాన్సర్ వస్తుందా?!

 నా వయసు 32. నేను భర్తతో విడిపోయాను. పిల్లలు లేరు. ఈ మధ్య ఓ పుస్తకంలో బిడ్డకు జన్మనివ్వని, పాలివ్వని వాళ్లకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని చదివాను. నేను బిడ్డని కనలేదు. అంటే నాకూ క్యాన్సర్ వస్తుందా?
 - కె.ఉషశ్రీ, హుస్నాబాద్

 మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువగా వస్తుంది. ఇది రావడానికి అనేక కారణాలుంటాయి. బాగా లావుగా ఉన్నా, బ్రెస్ట్ బాగా పెద్దగాను బరువుగాను ఉన్నా, పీరి యడ్స్ త్వరగా మొదలయ్యి లేట్‌గా ఆగిపోయేవారు, పిల్లలు లేనివారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. వీరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండటం లేదా ఎక్కువకాలం ఈస్ట్రోజన్ హార్మోన్‌కు ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, బ్రెస్ట్‌లోని కణాలు దీర్ఘకాలం ఈస్ట్రోజన్ ప్రభావానికి ప్రేరేపితమై వాటిలో మార్పులు ఏర్పడి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఫ్యామిలీస్‌లో బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జన్యువులు ఉండటం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వంటివి రావచ్చు.

 మెనోపాజ్ దశలో తీసుకునే హార్మోన్ రీప్లేస్‌మెంట్‌లో భాగంగా ఈస్ట్రోజన్‌ను ఎక్కువకాలం ఇవ్వడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. గర్భం దాల్చాక తొమ్మిది నెలల పాటు పీరియడ్స్ ఉండవు. అలాగే పాలిచ్చే సమయంలో కొన్ని నెలల పాటు పీరియడ్స్ ఉండవు. అంటే ఈ సమ యాల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్ ఉండదు. దానివల్ల కొంత కాలం బ్రెస్ట్... హార్మోన్ ప్రభావం నుంచి రక్షణ పొందుతుంది. దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకా శాలు తగ్గుతాయి. అంతేకాని పిల్లల్ని కనకపోతే, పాలివ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుందని కాదు.

 వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయంతే. కాబట్టి కంగారు పడకుండా, ప్రతినెలా పీరియడ్స్ అయిపో యిన తర్వాత అద్దం ముందు నిలబడి... అరచేతితో బ్రెస్ట్‌ను తడుముకుని చూడ ండి. ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, చర్మం లోపలికి నొక్కుకుని ఉందా, నిపుల్స్ లోపలికి లాక్కున్నట్టు ఉన్నాయా, వాటి నుంచి ద్రవం వస్తోందా అన్న అంశాలను పరిశీలించుకోండి. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్ల బ్రెస్ట్‌లో ఏదైనా తేడా ఉంటే తెలుస్తుంది. ఉంటే డాక్టర్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలి దశలో నిర్ధారిస్తే, వంద శాతం చికిత్సకు ఆస్కారం ఉంటుంది.
 
  నా వయసు 33. ముప్ఫై దాటాక పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏడు నెలలకే గర్భం దాల్చాను. స్కానింగ్‌లో ఫెయింట్ ఫీటల్ అని రావడంతో అబార్షన్ చేశారు. మళ్లీ ఆరు నెలలకు గర్భం దాల్చాను. అప్పుడూ అంతే. రెండో అబార్షన్ తర్వాతి నుంచి కడుపులో నొప్పి వస్తోంది. మరో డాక్టర్‌ని కలిస్తే అబార్షన్ చేసినప్పుడు గర్భసంచికి గీత పడింది అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నాకు ఆరోగ్యకరమైన గర్భం ఎందుకు రావడం లేదు? నాకు బిడ్డ కావాలి. సలహా ఇవ్వండి.
 - విజయలక్ష్మి, రాజమండ్రి

 గర్భం గర్భసంచిలో మొదలయ్యి అందులో పిండం ఏర్పడుతుంది. ఆరు వారాలకు దాని గుండె కొట్టుకో వడం మొదలవుతుంది. కొందరికి హార్మోన్ల అసమ తుల్యత లేదా జన్యుపరమైన కారణాల వల్ల పిండం సరిగ్గా ఏర్పడదు. గర్భంలో పిండం పెరగదు. దీనినే Blight Ovam అంటారు. కొందరిలో పిండం ఏర్పడు తుంది కానీ గుండె కొట్టుకోదు. లేదా కొన్నిరోజుల తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొన్నిసార్లు అండం నాణ్యత సరిగ్గా లేకపోయినా, తల్లిదండ్రుల్లో జన్యు సమస్యలు ఉన్నా కూడా పిండం పెరగకపోవచ్చు. థైరాయిడ్‌తో పాటు ఇతరత్రా హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓ, మధుమేహం, రక్తంలో యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటిబాడీస్ వంటివి ఉన్నా కూడా మొదటి మూడు నెలల్లో పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు అవుతుంటాయి.

 అబార్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు గర్భసంచికి చిల్లుపడే అవకాశం ఉంటుంది. మీరు గీత పడింది అన్నదానికర్థం ఇదే అనుకుంటు న్నాను. అలాంటివి మెల్లగా మానిపోతాయి. కాకపోతే మళ్లీ వెంటనే గర్భం దాల్చకుండా కొన్ని నెలలు ఆగితే మంచిది. కొంతమందికి 30, 35 యేళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత తగ్గడం వల్ల కూడా పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు జరుగుతుంటాయి. బరువు ఎక్కు వుంటే తగ్గడానికి ట్రై చేయండి. రెండుసార్లు అబార్షన్ తప్పలేదు కాబట్టి మీలో ఇంకేమైనా సమస్యలున్నా యేమో తెలుసుకోవడం మంచిది.

కాబట్టి  CBP, ESR, OGTT, FSH, TSH, APA, Sr. APTTపరీక్షలతో పాటు షుగర్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ టెస్టులు కూడా చేయించుకోండి. ఏదైనా తేడా ఉంటే ముందు నుంచే చికిత్స తీసుకుంటూ గర్భం కోసం ప్రయత్నించండి. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ Karyotyping అనే జన్యుపరీక్ష చేయించుకుని, ఏవైనా జన్యు సమస్యలుంటే కౌన్సెలింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోండి.            
                                                        
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement