
గాలి కాలుష్యంతో డయాబెటిస్
బెర్లిన్: దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గుర య్యే వారు టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. గ్లూకోజ్ జీవక్రియ బలహీనపడిన వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. జీవనశైలి, జన్యు లోపాలతోనే కాకుండా వాయు కాలుష్యం ద్వారా టైప్-2 డయాబెటిస్ సంక్రమిస్తుందని జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పీటర్స్ తెలిపారు.
ఈ మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 3,000 మందిపై పరిశోధన చేశామన్నారు. వీరి రక్తంలోని నమూనాల ఆధారంగా గ్లూకోజ్ స్థాయి, ఇన్సులిన్ స్థాయిలను పరీక్షించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారి కంటే దీర్ఘకాలంగా వాయుకాలుష్యానికి గురవుతూ పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్నవారిలో టైప్-2 డయాబెటిస్ సంక్రమించే లక్షణాలు ఎక్కువగా కనిపించాయన్నారు.