మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అకస్మాత్తుగా ప్రమాదకరంగా పరిణమించే ఈ సమస్య గురించి...
మెదడులోని ఏప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి ఉంటే ఆప్రాంతం పేరుతో అన్యురిజాన్ని చెబుతారు. ఉదాహరణకు సెరిబ్రమ్ అనే ప్రదేశంలో ఉంటే సెరిబ్రల్ అన్యురిజమ్స్ అంటారు. మెదడు చుట్టూ ఉండే ప్రధాన ప్రాంతం సబార్కనాయిడ్‌లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమైతే దాన్ని ‘సబార్కనాయిడ్ హ్యామరేజ్’ (ఎస్‌ఏహెచ్) అంటారు.
రక్తనాళాలు చిట్లిన ప్రదేశాన్ని బట్టి మెదడు ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ అవయవం ప్రభావితమవుతుంది. అయితే ఇలా అన్యురిజమల్ బ్లీడ్‌కి గురైన ప్రతి ఏడుగురిలోనూ నలుగురు ఏదో ఒక రకమైన వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది. కీలక ప్రాంతంలో రక్తస్రావం కాగానే మొదట అది పక్షవాతానికీ (స్ట్రోక్‌కు), తీవ్రతను బట్టి కోమాలోకి తీసుకెళ్లే అవకాశాలెక్కువ.
బయట పడేందుకు అవకాశం తక్కువ... ఎందుకంటే?
అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో అవి వారి జీవితకాలంలో అవి చిట్లక΄ోవచ్చు. ఉబ్బు చిన్నగా ఉన్నవి కాకుండా... ‘జెయింట్ అన్యురిజమ్స్’ అని పిలిచే పెద్దవి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలెక్కువ. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్‌లాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా వస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక వల్ల గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్‌కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది.
కారణాలు:
కంట్రోల్‌లో లేని అధిక రక్త΄ోటు, డయాబెటిస్ వంటి జబ్బులు.
చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు (ఈ కారణంగా ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ)
రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్‌తో కలిగే కాంప్లికేషన్లు ఆరోగ్యకరంగా లేని జీవనశైలి
పొగాకు వాడకం, మద్యం అలవాటు
యాక్సిడెంట్‌లో రక్తనాళాలకు గాయం
కొన్ని అరుదైన కేసుల్లో : ఉదా. ఫైబ్రోమస్క్యులార్ డిస్‌ప్లేసియా
కిడ్నీల్లో నీటితిత్తులు వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్.
చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు:
జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత బాధతో కూడిన తలనొప్పి
స్పృహ కోల్పోవడం
పక్షవాతం / ఫిట్స్ కూడా
మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం.
చికిత్సలు:
మందులిస్తూ చేసే చికిత్స: ఇది రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స. రక్త΄ోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొన్ని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు.
శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె (క్రేనియమ్) తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా అన్యురిజమ్‌లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిగాక ముందులాగే రక్తప్రసరణ జరిగేలా చూస్తారు.
ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్‌ను ప్రవేశపెట్టి... అందులో నుంచి మరింత చిన్నపైప్‌లను అన్యురిజమ్స్ వరకు చేరేలా చేసి, అక్కడ కాయిల్ అనే డివైజ్‌ని అన్యురిజమ్ నింపడానికి వాడతారు. దాంతో ఉబ్బిన బలహీన ప్రాంతానికి రక్తసరఫరా ఆగడంతో చిట్లడం జరగదు.
ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియతో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. దాంతో పెద్ద రక్తనాళాల దగ్గర ఉన్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇక ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’తో రక్తపు దిశను మళ్లించి ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు.
(చదవండి: కేరళలో నిఫా వైరస్ కలకలం..!)
Comments
Please login to add a commentAdd a comment