కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా? | Eyelid bump: Symptoms Causes And Treatment | Sakshi
Sakshi News home page

కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?

Published Wed, Oct 11 2023 11:45 AM | Last Updated on Wed, Oct 11 2023 11:56 AM

Eyelid bump: Symptoms Causes And Treatment - Sakshi

కనురెప్పల లోపల గానీ బైటగానీ కురుపులు లేదా గడ్డలు పెట్టే బాధ అంత ఇంత కాదు. ఒకవేళ వచ్చినా అంత ఈజీగా తగ్గదు. ఇంతకీ ఇది అంటువ్యాధా? ఎలా తగ్గించుకోవాలి తదితరాల గురించి ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ నవీన్‌ నడిమింటి గారి మాటల్లో చూద్దాం!.

కనురెప్ప లోపలగాని బైటగాని లేచిన కంటి కురుపు నవీన్ నడిమింటి సలహాలు కనురెప్పల మీద కొందరికి కంటికురుపులు వచ్చి మహా ఇబ్బందిని కలుగజేస్తాయి. ఇది బ్యాక్టీరియా చేరడం వల్లగానీ, కనురెప్పల మీదనున్న తైల గ్రంధినాళం (sebaceous glands of Zeis) మూతపడటం వల్లగానీ జరుగుతుంది. దురదకు కళ్ళు పులుము కుంటే ఆ కురుపు చితికి ప్రక్కన మరో కురుపు వస్తుంది. ఇటువంటి కురుపులు ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిలా సోకే ప్రమాదం ఉంది. కంటికురుపులు వచ్చిన పిల్లలకు వాడిన సబ్బు, టవల్ ఇతర పిల్లలకు వాడకూడదు .

లక్షణాలు:
కనురెప్పపై అంచున చివరన ఉండే సెబాసియస్‌ గ్రంథి ఇన్‌ఫెక్షన్‌కు గురికావటం వల్ల కురుపులాగా ఏర్పడి, కంటికి ఎంతో బాధను కలిగిస్తుంది. ఇందువల్ల కంటిభాగము ఎర్రగా మారిపోతుంది. కనురెప్పపై వాపు ఏర్ప డుతుంది. వాపుతో కూడిన ఈ చిన్నని పుండు కనురెప్ప అంచున ఏర్పడడం వల్ల కనురెప్పలు మూసి తెరచేటప్పుడు ఎంతో బాధాకరంగా ఉంటుంది. కళ్ళు మంటగా ఉంటాయి. కంటిలో ఏదో నలత పడి ఉన్నట్లు ఉంటుంది. కంటి చూపులో తగ్గుదల ఉంటుంది. కంటిలో నీరు, పుసి కారుతుంది. 

బ్యాక్టీరియ వలన కంటి కురుపులు తరచుగా వస్తాయి. రాత్రులు నిద్ర చాలకపోతే కొన్నాళ్ళకు కంటి కురుపులు వస్తాయి. సమతుల్య ఆహారం లోపం వలన, కంటి శుభ్రత లోపించే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కళ్ళను ఏ కారణము చేతనైనా బాగా రుద్దడం వలన, ఈ సమస్య తలెత్తుంది

చికిత్స: 

  • ఒక స్పూన్‌ బోరిక్ పొడిని పావుకప్పు నీటిలో కరిగించి ... ఆ నీటితో కనురెప్పలను రోజులు 4 నుంచి 5 సార్లు కడగాలి.. ఇన్ఫెక్షన్‌ తగ్గి కురుపులు నయమవుతాయి. అటువంటి కురుపుకు వేడి చేసిన గుడ్డను కాపడం పెట్టాలి. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • దీంతోపాటు ఒక చెంచా ధనియాలు ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాత ఆ కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
  • జామ ఆకును వేడి చేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి.
  • లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టాలి. కంటి కురుపుకు చింతకాయ గింజలు రెండు రోజులు నానబెట్టి ఆ గంధంను పట్టించాలి. మల్లీ (మరల) ఎప్పడికీ రావు .
  • ఒక కప్పు నీళ్లల్లో రెండు లేదా మూడు అలమ్‌ పూసలను బాగా కలిపి, ఆ నీటిని కండ్లు శుభ్రపర్చుకునేందుకు వాడాలి. లేదా మీరు స్పటిక భస్మాన్ని (ఇది ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతుంది) కూడా వాడవచ్చు. ఇందువల్ల కంటిపై వాపు, ఎర్రబడిన కనురెప్పలు మామూలు స్థితికి వస్తాయి. నీరుకారడం కూడా తగ్గిపోతుంది.
  • ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్‌ పసుపును బాగా మరగ కాచా లి. ఇలా అర గ్లాసు నీళ్ళుండేంతవరకు మరగకాచి, ఈ నీటిని వడగట్టి, ఒక శుభ్రమైన బట్టతో కంటిని శుభ్రం చేసుకొని రోజుకు రెండు లేదా మూడు చుక్కలను కంటిలో వేసుకోవడం వల్ల ఈ సమస్య సమసిపోతుంది. దీనిని 'ఐ డ్రాప్స్‌'గా కూడా వాడవచ్చు.
  • ఖర్జూరపు విత్తనాన్ని ఒక రాయిపై బాగా రుద్దగా వచ్చిన చూర్ణాన్ని కంటికి నొప్పి కలిగించే ప్రాంతంలో అప్లై చేయాలి. ఉల్లిపాయపై ఎండిన పొరను నిప్పుల మీద కాల్చి ఆ మసిని కంటి రెప్ప పై కురుపు మీద రాస్తే ఆ కురుపు త్వరగా నయం అవుతుంది.

ఆయుర్వేద నిపుణులు, డాక్టర్‌ నవీన్‌ నడిమింటి

(చదవండి: చిన్నారుల్లో వచ్చే ఆటిజం, హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌కి ప్లాస్టిక్‌ కారణమా!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement