'మనుషులకు పందుల అవయవాలు'
వాషింగ్టన్: వివిధ ప్రమాదాలలో, వ్యాధుల వల్ల అవయవాలు కోల్పోయే వారికి పందుల నుండి సేకరించిన అవయవాలను అమర్చడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. నూతన జన్యు ఎడిటింగ్ విధానం ' సిఆర్ఐఎస్పీ ఎస్9' ద్వారా ఇంతకు ముందు సాధ్యం కానటువంటి క్లిష్టమైన జీన్ ఎడిటింగ్ ప్రక్రియ సాధ్యమైనట్లు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
మానవుని గుండెకు సంబంధించిన కవాటాల మార్పిడి చికిత్సలో పందుల యొక్క గుండె కవాటాలను ప్రస్తుతం వాడుతున్నారు. కాగా అవయవాలను, కణజాలాలను ఉపయోగించాల్సిన సందర్భంలో ఎదురయ్యే సమస్యలు నూతన విధానంతో తొలగిపోనున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన జన్యు విధానం ద్వారా సుమారు 62 రకాల జన్యువులను ఎడిట్ చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే త్వరలోనే పందుల యొక్క పూర్తి స్థాయి కణజాలాలు, అవయవాలు మనుషులకు అమర్చనున్నారు.