ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువర్గాలకు చెందిన వందలాదిమంది మృతి చెందగా, లెక్కలేనంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే యూదులు తమ వైద్యచికిత్సలో ఎవరి నుంచి కూడా రక్తాన్ని తీసుకోరనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో, అదే నిజమైతే దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూదులు తమ పవిత్ర గ్రంథం ‘తోరా’లో ఉన్న నియమనిబంధనలను తప్పక పాటిస్తారు. మారుతున్న కాలంతో పాటు ఈ నిబంధనలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే పాతతరం యూదులు చికిత్స సమయంలో ఎవరి రక్తాన్ని తీసుకునేందుకు ఇష్టపడరు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నా మరొకరి రక్తాన్ని తమ శరీరంలోకి ఎక్కించడాన్ని వారు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే యూదులు రక్తాన్ని ప్రాణంతో సమానంగా భావిస్తారు. వేరొకరి రక్తాన్ని తీసుకోవడమంటే వారి ప్రాణాన్ని తీయడమేనని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మెల్లగా మారుతోంది. నేడు యూదులు కూడా తమకు రక్తం అవసరమైనపుడు దానిని ఎక్కించుకునేందుకు అంగీకరిస్తున్నారు.
నాటి తరం యూదులు తమ దేవుని శక్తిపై మాత్రమే గాఢమైన నమ్మకాన్ని కలిగివుంటారు. తాము అనారోగ్యానికి గురైనప్పుడు దేవుని ప్రార్థన ద్వారా మాత్రమే ఆరోగ్యవంతులమవుతామని నమ్ముతుంటారు. వీరిలోని చాలామంది నేటికీ వైద్యుల దగ్గర చికిత్స తీసుకోరు. మందులు వాడరు. అయితే నేటి తరం యూదులు ఆధునిక వైద్యాన్ని వినియోగించుకోవడమే కాకుండా, వైద్య పద్ధతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నుక్భా ఫైటర్స్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment