ఫీవర్రీ జిల్లాకు జ్వరమొచ్చింది | Fever district to the fever | Sakshi
Sakshi News home page

ఫీవర్రీ జిల్లాకు జ్వరమొచ్చింది

Published Tue, Aug 4 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

ఫీవర్రీ  జిల్లాకు జ్వరమొచ్చింది

ఫీవర్రీ జిల్లాకు జ్వరమొచ్చింది

నగరంలో మలేరియా (పీవీ) ఆనవాళ్లు
చల్లపల్లి, పెడన, తోట్లవల్లూరుల్లో డెంగీ కేసులు
చిన్నారులపై ఫ్లూ పంజా
జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న   భయానక వ్యాధులు
 

 డెంగీ, మలేరియా, ఫ్లూ, వైరల్.. ప్రస్తుతం నగరంపై దండయాత్ర చేసిన భయానక వ్యాధులు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిపై విరుచుకుపడుతున్న ఈ విషజ్వరాలు జిల్లావాసులను భయ          కంపితులను చేస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి సోకితే                వరుసగా మిగతా వారినీ చుట్టుముడుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న ఈ జ్వర రక్కసి బారిన పడి ఊళ్లకు ఊళ్లు మంచాన పడుతున్నాయి.  లేకుండా అవుట్ పేషెంట్లుగా చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలోని కొత్తమాజేరు, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జ్వర బాధితులు నగరంలోని ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. నగ రంలో జ్వర బాధితుల నుంచి గత సోమవారం నుంచి శనివారం వరకూ మలేరియా సిబ్బందే 2,150 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. వారిలో ఆరుగురికి మలేరియా (పీవీ) పాజిటివ్ ఉన్నట్లు అధికారులు చెప్పారు.

 చిన్నారులకు ఫ్లూ
 ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్న జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన చిన్నారులు నగరంలోని ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పిల్లల ఆస్పత్రిలన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం రోజుకు 70 నుంచి 100 మంది చిన్నారులకు ఓపీలో పరీక్షలు నిర్వహిస్తుండగా, వారిలో 50 మందికిపైగా ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నవారే. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఈ జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. ఈ జ్వరంతో వస్తున్న వారిలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ జ్వరాలు ఐదు నుంచి వారం రోజుల్లో తగ్గిపోతాయని, ఒకరి నుంచి వేరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయని వారు పేర్కొంటున్నారు.

 హడలెత్తిస్తున్న డెంగీ, టైఫాయిడ్
 జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ, టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో చల్లపల్లి మండలం కొత్తమాజేరులో తాగునీటిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు కలవడంతో వరుసగా జ్వరాల బారిన పడి 18 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

తోట్లవల్లూరులో ఒకే ప్రాంతానికి చెందిన ఆరుగురికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారికి నగరంలో పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి ఎలీసా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. విస్సన్నపేట మండలం మృతరాజపాలెం, బందరు సమీపంలోని చిన్నాపురంలో కూడా ఇటీవల వైరల్ జ్వరాలు విజృంభించాయి.  
 
ఫ్లూ జ్వరాలే ఎక్కువ..
 మా వద్దకు వస్తున్న చిన్నారుల్లో అధికశాతం ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నవారే. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఇక్కడికి వస్తున్నారు. ఇటువంటి వారికి ఐదు నుంచి ఏడు రోజుల్లోనే జ్వరం తగ్గిపోతోంది. ఇటీవల డెంగీ అనుమానిత కేసులు రెండు వచ్చాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలకు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స అందించాలి. డెంగీ సోకిన వారి శరీరంపై రాష్ వచ్చినా, మూత్రంలో, విరేచనంలో రక్తం పడుతున్నా సీరియస్‌గా ఉన్నట్లు భావించారు. ప్లేట్‌లెట్స్ పరీక్ష చేయించి అప్రమత్తంగా ఉండాడాలి.
 - డాక్టర్ చంద్రమోహన్,
 పిల్లల వైద్య నిపుణుడు, ప్రభుత్వాస్పత్రి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement