తామర, మలేరియాలపై పరిశోధనలకు నోబెల్ | Nobel Prize in Medicine Awarded to Scholars for Parasite-Fighting Therapies and malaria | Sakshi
Sakshi News home page

తామర, మలేరియాలపై పరిశోధనలకు నోబెల్

Published Mon, Oct 5 2015 4:03 PM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM

తామర, మలేరియాలపై పరిశోధనలకు నోబెల్ - Sakshi

తామర, మలేరియాలపై పరిశోధనలకు నోబెల్

అట్లాంటా: ఏళ్లుగా మానవాళిని తీవ్రంగా బాధిస్తోన్న తామర, మలేరియా వ్యాధులపై పరిశోధనలకుగానూ మెడిసిన విభాగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఈమేరకు సోమవారం జరిగిన కార్యక్రమంలో నోబెల్ కమిటీ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది.

శరీరం నుంచి తామర నిర్మూలను సరికొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టినందుకుగానూ జపాన్ శాస్త్రవేత్త సాన్ తోషి ఒమురా, అమెరికన్ శాస్త్రవేత్త విలియమ్. సి. క్యాంప్ బెల్ లకు నోబెల్ దక్కింది. చైనా శాస్త్రవేత్త యుయూ తూ కూడా వీరితోపాటు పురస్కారాన్ని పంచుకున్నారు. మలేరియా నివారణకు నూతన విధానాలు కనుగొన్నందుకుగానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది.

టోక్యోలోని కిటాసాతో యూనివర్సిటీకి చెందిన సాన్ తోషి.. ఐర్లాండ్ కు చెందిన విలియమ్ క్యాంప్ బెల్ తో కలిసి తామరపై పలు పరిశోధనలు చేశారు. క్యాంప్ బెల్ అమెరికాలోని డ్రేవ్ యూనివర్సిటీ (మాడిసన్, న్యూజెర్సీ)కి చెందినవారు. ఇక యుయూ తూ.. బీజింగ్ లోని  చైనా అకాడమీ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో మలేరియాపై పలు పరిశోధనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement