- ఆస్పత్రుల్లో వెలుగు చూస్తున్న లోపాలు
- అనుబంధ ఆహారానికి నిర్ణయం
- మన్యంలో 500 మంది రోగులకు మేలు
కొయ్యూరు: మన్యంలో మలేరియా తగ్గుము ఖం పట్టినా క్షయ మాత్రం అదుపులోకి రావ డం లేదు. దీనిపై దృష్టి సారించిన ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ పీహెచ్‌సీ తనిఖీల్లో ను క్షయపై వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని చూ స్తున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని హె చ్చరిస్తున్నారు. మన్యంలో 500 మందికి పైగా ఉన్న క్షయ రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. క్షయపై సరైన పర్యవేక్షణ లేక చాలా మంది సకాలంలో గుర్తింపునకు నోచక వ్యాధి ముదిరి మరణిస్తున్నారు.
మొదటి పరీక్ష అనంతరం మందులిస్తారు. రెండు నెల ల తరువాత రెండోసారి ఉ మ్ము పరీక్షను చేయాలి. కా నీ ఒకసారి మందులిచ్చాక రోగు లు ఏమవుతున్నారో, వారి ఆరోగ్యం ఎలా ఉందో ప ర్యవేక్షించే వారు కరవయ్యారు. కొందరికి సరైన అవగాహన లేక మందులు వాడుతూ సారా తాగి చని పోతున్నారు. రోగి ని ఆస్పత్రికి తీసుకువచ్చే బాధ్యత క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశ వర్కర్లదని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
వాస్తవానికి ఈ విషయం ఆశ వర్కర్లకు కూడా పూర్తిగా తెలియదు. క్షయను నయం చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా ఉం టున్నారని పీవో తనిఖీల్లో తేటతెల్లమవుతోం ది. సరైన రికార్డులు లేకపోవడం, మందులు ఒక పద్ధతి లో ఇవ్వకపోవడం బయట పడ్డాయి. పీవో వైఖరిని గమనిం చిన నర్సీపట్నం క్లస్టర్ ఎస్‌పీహెచ్‌వో గురువా రం తన పరిధిలో వైద్యులతో సమావేశం ఏర్పా టు చేశారు.
అనుబంధ ఆహారం ఇస్తాం: పీవో
క్షయ రోగులకు అనుబంధ ఆహారం ఇస్తామని ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ తెలిపారు. దీనిలో భాగంగానే క్షయ రోగులపై పూర్తిగా దృష్టి పెట్టామన్నారు. ఆస్పత్రుల్లో వారిపై నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. రికార్డులు సరిగా నిర్వహించకపోయినా, మందులు సరిగా ఇవ్వకపోయినా చర్యలు తీసుకుంటామని చెప్పారు.