మలేరియాతో ఇద్దరు మృతి | Two die of Malaria | Sakshi
Sakshi News home page

మలేరియాతో ఇద్దరు మృతి

Published Sun, Aug 23 2015 12:03 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

మలేరియా జ్వరాలతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం విజయనగరం జిల్లా సీతాపురం మండలం అనంతరాయుడిపేట గ్రామంలో జరిగింది.

సీతానగరం (విజయనగరం జిల్లా) : మలేరియా జ్వరాలతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం విజయనగరం జిల్లా సీతాపురం మండలం అనంతరాయుడిపేట గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతరాయుడిపేట గ్రామానికి చెందిన సింహాచలం(50), అన్నపూర్ణమ్మ(45)లు ఇద్దరూ మలేరియాతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

కాగా ఇదే గ్రామానికి చెందిన మరో 20 మంది మలేరియా జ్వరాలతో బాధపడుతున్నట్లు సమాచారం. వీరందరూ పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యం కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. అయితే గ్రామంలోని పలువురి నుంచి రక్త నమునాలను సేకరించిన డాక్టర్లు మలేరియా సోకిందని తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement