విజయనగరం జిల్లా సాలూరు మండలానికి చెందిన ఓ యువతి మలేరియా కారణంగా బుధవారం మృతి చెందింది.
సాలూరు రూరల్: విజయనగరం జిల్లా సాలూరు మండలానికి చెందిన ఓ యువతి మలేరియా కారణంగా బుధవారం మృతి చెందింది. సాలూరు మండలం భోగవలసకు చెందిన చింతాడ శోభారాణి (18) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె గత శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా వైద్యులు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శోభారాణి బుధవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. భోగవలస గ్రామంలో వారం క్రితం మలేరియాతో ఓ మహిళ మృతి చెందగా, ఇది రెండో మరణం. దీనిపై స్థానిక వైద్యాధికారి శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో రోటా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ వైరస్ ఏ వ్యాధినైనా ఉధృతం చేస్తుందని చెప్పారు.