మలేరియాకు ఇక కొత్త చికిత్స
లండన్: మలేరియాను సమర్థంగా నివారించేందుకు విప్లవాత్మక కొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు మలేరియా పరాన్నజీవి(ప్లాస్మోడియం)కి అతిముఖ్యమైన ‘పీఎఫ్‌పీకేజీ’ అనే కైనేజ్ ప్రొటీన్‌ను కనుగొంది. పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ మహమూద్ ఆలం కూడా ముఖ్య పాత్ర పోషించారు.
బ్రిటన్‌లోని వర్సిటీ ఆఫ్ లీసెస్టర్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తల బృందంతో కలసి పరిశోధనల్లో పాల్గొన్నారు. కైనేజ్ ప్రొటీన్‌ను నిర్వీర్యం చేయడం వల్ల పరాన్నజీవిని హతమార్చవచ్చని కనుగొన్నారు. వీరి పరిశోధన ఫలితాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో వచ్చాయి.