మలేరియాను అంతం చేద్దాం
మలేరియాను అంతం చేద్దాం
Published Tue, Apr 25 2017 10:28 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
–జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ
కర్నూలు(హాస్పిటల్): సమాజం నుంచి మలేరియాను అంతం చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ వద్ద ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ నుంచి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వరకు కొనసాగింది. కలెక్టర్ మాట్లాడుతూ 2030 నాటికి మలేరియాను అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి మలేరియాపై ప్రజలకు చైతన్యపరిచినట్లు తెలిపారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని సూచించారు. ఈ మేరకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ టి. రామనాథ్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ మీనాక్షిమహదేవ్, మలేరియా జిల్లా అధికారి జె.డేవిడ్‌రాజు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణచక్రవర్తి, డీఐవో డాక్టర్ వెంకటరమణ, ఇన్‌ఛార్జి డెమో ఎర్రంరెడ్డి, ఆర్‌బీఎస్‌కే ప్రాజెక్టు కో ఆర్డినేటర్ హేమలత పాల్గొన్నారు.
Advertisement