సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఓ వైపు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. మరోవైపు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో రాబోయే 15 రోజుల పాటు డెంగీ జ్వరాలు విస్తరించే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే జ్వ రం వస్తే.. డెంగీదా? లేక కరోనాదా? తెలి యక జనానికి గందరగోళంగా మారింది. ము న్ముందు కరోనాతోపాటు డెంగీ కేసులు కూడా పెరిగే అవకాశం ఉండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కిందిస్థాయిలో ఇంటిం టి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర వ్యాధుల ను నియంత్రించడంపై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.
(చదవండి: బాధితులతో రాయ‘బేరాలు’)
గతేడాది తీవ్రంగానే డెంగీ..
గతేడాది డెంగీ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారమే అప్పుడు ఏకంగా 13వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డెంగీ వీరవిహారం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1,100 వరకు డెంగీ కేసులు, 600 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. డెంగీకి, కరోనాకు కామన్‌గా రెండింటికీ ఒకే తరహా లక్షణాలుండటంతో ఏదేంటో అంతుబట్టడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం డెంగీలో ఉండే సాధారణ లక్షణాలు. ఇవే కరోనాలో కూడా ఉండటంతో బాధితులు తమకు ఏది సోకిందో టెస్టులు జరిగి నిర్ధారణయ్యే వరకు తెలుసుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం రెండూ కలిసి వచ్చే అవకాశాలున్నాయా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రెండింటినీ ఒకేసారి ఎదుర్కోవాల్సి రావడం వైద్య యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా కాలం కావడంతో ఉన్న సిబ్బంది అంతా దానికోసమే పనిచేయాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా తక్షణ నియామకాలు చేపట్టాలని సర్కారు ఆదేశించినప్పటికీ.. చాలాచోట్ల తాత్కాలిక నియామకాలకే నోటిఫికేషన్లు ఇవ్వడంతో భర్తీ ప్రక్రియ ముందుకుసాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
(చదవండి: తెలంగాణలో 1682 కేసులు, 8 మంది మృతి)
జిల్లాలకు ఇవే మార్గదర్శకాలు..
⇒ ప్రతి జిల్లాలోనూ కరోనా కేసులు ఎక్కువున్న ప్రాంతాలు, తక్కువ ఉన్న ప్రాంతా లు, అసలు కేసులు నమోదు కాని ప్రాంతాలుగా వేర్వేరుగా విభజించాలి.
⇒ దోమల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతూనే కరోనా నిబంధనలను పాటించడంపై ప్రజలను చైతన్యం చేయాలి.
⇒ కరోనా జాగ్రత్తలతోపాటు ఇళ్లు, పరిసరా ల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
⇒ అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి.
⇒ డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి జ్వర నిర్ధారణ చేయాలి.
⇒ మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాల ను చేపట్టాలి. æ డెంగీ, కరోనా రెం డూ ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమీపం లోని ఆసుపత్రికి సమాచారమివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment