సాక్షి, ముంబై : మూడురోగాలు కలిసి నగరవాసులపై ముప్పేట దాడిచేస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజ్‌గా నగరవాసులను, డాక్టర్లను కలవరపెడుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది నగర వాసులు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఒక్కరికే ఈ మూడు వ్యాధులు సోకిన కేసులు కూడా కొన్ని చోటుచేసుకున్నాయి. ఈ వ్యాధుల సోకిన రోగులతో నగరంలోని వివిధ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డెంగీ సోకడం ద్వారా అవయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే రోగి మరణి స్తాడని, ఏ చిన్న జ్వరం వచ్చినావెంటనే వైద్యులను సంపద్రించాలని సూచిస్తున్నారు. ఈ మూడు వ్యాధులపై డాక్టర్ల సూచనలు వారి మాటల్లోనే..
రోగిలో తెల్లరక్తకణాల తగ్గుముఖం: డాక్టర్ భజన్
నాలుగు నుంచి ఐదు వరకు డెంగీ కేసులను పరిశీలించానని డాక్టర్ భజన్ చెప్పారు. వీరికి యాంటీ మల్లేరియా చికిత్స అందజేశామన్నారు. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వస్తున్నార ని, ఈ రోగులలో చాలా మందికి తెల్లరక్త కణాలు గణనీయంగా తగ్గిపోయి ఉన్నాయన్నారు. ప్లేట్‌లెట్‌లు భారీగా పడిపోతున్నాయని తెలిపారు.
మిక్స్‌డ్ ఇన్‌ఫెక్షన్ : డాక్టర్ రాయ్ పటాన్కర్
డెంగీ, మల్లేరియాతోపాటు టైఫాయిడ్ కేసులు చాలా ఆస్పత్రులలో నమోదు అవుతున్నాయన్నాయని చెంబూర్‌లోని జాయ్ ఆస్పత్రి వైద్యుడు రాయ్ పటాన్కర్ తెలిపారు.గత వారం నుంచి జ్వరంతో బాధపడుతున్న ఓ బాలికకు టైఫాయిడ్, మలేరియా, డెంగీకి పరీక్షలు నిర్వహించామన్నారు. ఆ బాలికకు ‘మిక్స్‌డ్ ఇన్ఫెక్షన్’ సోకినట్లు తేలిందన్నారు. ఇటీవల ఇది నాలుగో కేసు అని చెప్పారు.
ఒకే మాదిరిగా లక్షణాలు
మల్లేరియా, టైఫాయిడ్, డెంగీ ఈ మూడు వ్యాధుల లక్షణాలు ఒకే రకంగా ఉంటాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు జలీల్ పార్కర్‌న్నారు. ఏ చిన్న జ్వరం వచ్చినా ఈ మూడు వ్యాధుల పరీక్షలు నిర్వహించాలన్నారు. జ్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. రోగుల చికిత్సలో జాప్యం చేయడం ద్వారా అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సారి డెంగీ సోకిన కేసుల్లోనూ లివర్, లంగ్స్, కిడ్నీలకు ప్రమాదం దాపురించిందని చెప్పారు. ఏ చిన్నపాటి జ్వరమైనా నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
మూడు వ్యాధులు..ముప్పేట దాడి!
Published Fri, Oct 10 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement
Advertisement