మలేరియా కారక సూక్ష్మజీవిపై సీసీఎంబీ పరిశోధనలు  | CCMB Investigations On Malaria Causative Microbiota  | Sakshi
Sakshi News home page

మలేరియా కారక సూక్ష్మజీవిపై సీసీఎంబీ పరిశోధనలు 

Published Wed, Jan 15 2020 4:52 AM | Last Updated on Wed, Jan 15 2020 4:52 AM

CCMB Investigations On Malaria Causative Microbiota  - Sakshi

పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు 

సాక్షి, హైదరాబాద్‌: మలేరియా కారక పరాన్నజీవిని మరింత సులువుగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మలేరియా వ్యాధి నియంత్రణకు ఈ పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకోవడం ముఖ్యం కాగా.. మన ఎర్ర రక్తకణాల్లోకి చేరి డీఎన్‌ఏను వాడుకునే దీని జన్యువులను తెలుసుకోవాలంటే 4 పొరలను దాటాల్సి ఉంటుంది.

ఈ పొరలన్నింటినీ తొలగించి లోపలి పరాన్నజీవి పనితీరును అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఎలక్ట్రోపోరేషన్‌ అనే ఖరీదైన పద్ధతిని వాడుతున్నారు. డాక్టర్‌ పూరన్‌సింగ్‌ సిజ్‌వాలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ సమస్య పరిష్కారానికి మలేరియా కారక ప్లాస్మోడియం ఫాల్సీపరంపై పరిశోధనలు చేపట్టింది. లైజ్‌–రీ సీల్‌ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా ప్లాస్మోడియం ఫాల్సిపరం కణాల్లోకి బయటి నుంచి జన్యువులను జొప్పించడం సులువవుతుంది. ఈ పరాన్న జీవి.. డీఎన్‌ఏలతో కూడిన ఎర్ర రక్తకణాల్లోకి చేరిపోయి అక్కడ ఉన్న డీఎన్‌ఏలోకి తనదైన జన్యువులు చొప్పిస్తుంది. పరిశోధన వివరాలు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement