![State Govt Malaria Control National Recognition: Harish Rao - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/23/HARISH-RAO-5.jpg.webp?itok=33DS06HZ)
సాక్షి, హైదరాబాద్: మలేరియాను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015–21) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని, దీంతో తెలంగాణ కేటగిరీ–2 నుంచి కేటగిరీ–1లోకి చేరిందని కేంద్రం ప్రశంసించింది. ‘సత్కారాన్ని అందుకునేందుకు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపింది’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment