మలేరియా పనిపట్టిన మహావైద్యుడు | Ronald Ross and the Discovery that Mosquitoes Transmit Malaria Parasites | Sakshi
Sakshi News home page

మలేరియా పనిపట్టిన మహావైద్యుడు

Published Thu, Oct 2 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

మలేరియా పనిపట్టిన మహావైద్యుడు

మలేరియా పనిపట్టిన మహావైద్యుడు

మలేరియా పనిపట్టిన మహావైద్యుడాయున. దోమల జీర్ణకోశంలో దాగిన మలేరియా పరాన్నజీవి ఆచూకీని కనుగొన్నాడు. ఆయున పరిశోధనల ఫలితంగా మలేరియా మహమ్మారి తాకిడి గణనీయంగా తగ్గింది. మలేరియాపై పరిశోధనలు ఆయునకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. ఆయునే సర్ రొనాల్డ్ రాస్. ఆయన పుట్టి పెరిగింది భారత్‌లోనే. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న అల్మోరాలో 1857 మే 13న పుట్టాడు. తండ్రి సర్ కాంప్‌బెల్ క్లే గ్రాంట్ రాస్ అప్పట్లో భారత్‌లోని బ్రిటిష్ సైన్యంలో జనరల్‌గా పనిచేసేవాడు. రొనాల్డ్‌ను ఎనిమిదో ఏటనే చదువు కోసం తండ్రి ఇంగ్లండ్‌కు పంపేశాడు.
 - రొనాల్డ్ రాస్
 హైదరాబాదీ
 
 సౌతాంప్టన్ చేరువలోని స్ప్రింగ్‌హిల్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత లండన్ మెడికల్ కాలేజీలో, రాయుల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, రాయుల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియున్స్‌లో వైద్యశాస్త్రం చదువుకున్నాడు. పబ్లిక్ హెల్త్‌లో డిప్లొవూతో పాటు బ్యాక్టీరియూలజీ కోర్సునూ పూర్తి చేశాడు. వైద్యశాస్త్రానికి విస్త­ృతంగా అధ్యయునం చేసిన రొనాల్డ్ రాస్ ప్రతిభా పాటవాలు వైద్యరంగానికి వూత్రమే పరిమితం కాలేదు. స్ప్రింగ్‌హిల్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్న కాలంలోనే కవిత్వం, సంగీతం, గణితం, చిత్రకళలపై ఆసక్తి పెంచుకున్నాడు. పద్నాలుగేళ్ల వయుసులోనే గణిత శాస్త్రంలో బహువుతి అందుకున్నాడు. పదహారేళ్ల వయుసులో ఆక్స్‌ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జి డ్రారుుంగ్ పరీక్షలో ప్రథవుుడిగా నిలిచాడు. విద్యార్థి దశలో కవిత్వ, నాటక రచన కొనసాగించడమే కాకుండా, పాటలకు స్వరకల్పన చేసేవాడు.
 
 సికింద్రాబాద్‌లోనే కీలక పరిశోధనలు...
 ఇంగ్లండ్‌లో చదువు పూర్తయ్యూక రొనాల్డ్ రాస్ 1881 సెప్టెంబర్ 22న భారత్ చేరుకున్నాడు. అప్పటి నుంచి 1894 వరకు ఇండియున్ మెడికల్ సర్వీస్ అధికారిగా వుద్రాసు, బర్మా, బెలూచిస్థాన్, అండవూన్ దీవులు, బెంగళూరు, సికింద్రాబాద్ సహా పలుచోట్ల పనిచేశాడు. బెంగళూరులో ఉండగానే ఆయున దోవుల వల్ల వ్యాపించే వ్యాధులపై దృష్టి సారించాడు. వుధ్యలో సెలవులపై సకుటుంబంగా లండన్ వెళ్లినప్పుడు 1894లో తన గురువు పాట్రిక్ వూన్సన్‌ను తొలిసారిగా కలుసుకున్నాడు. వులేరియూ పరిశోధనలో ఎదురయ్యే సవుస్యలను వూన్సన్ ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వులేరియూపై పరిశోధనలకు భారతదేశమే అనువైన ప్రదేశవుని వూన్సన్ నవ్ముకంగా అతడికి చెప్పాడు.
 
  సెలవుల తర్వాత రాస్ 1895 వూర్చి 20న సికింద్రాబాద్‌లో దిగాడు. కస్టమ్స్ కార్యాలయుంలో లగేజీ క్లియుర్ కాకవుుందే, అక్కడి నుంచి నేరుగా బొంబారుు సివిల్ ఆస్పత్రికి చేరుకుని, వులేరియూ రోగుల రక్తపు నవుూనాల పరిశీలనకు ఉపక్రమించాడు. రెండు నెలల వ్యవధిలోనే దోవుల జీర్ణకోశంలో వులేరియూ పరాన్నజీవి తొలి దశలను గుర్తించాడు. ఈలోగా బెంగళూరులో కలరా విజృంభించింది. రాస్‌ను అక్కడకు బదిలీ చేయుడంతో అతడి వులేరియూ పరిశోధనలకు అంతరాయుం కలిగింది. బెంగళూరులో వులేరియూ కేసులు పెద్దగా ఉండేవి కావు. ఈ పరిస్థితికి కలత చెంది ‘నన్నో వుూలకు విసిరేశారు. ఇక్కడ నాకు పనేం లేదు’ అంటూ వూన్సన్‌కు లేఖ రాశాడు. అరుుతే, 1896 మేలో తిరిగి సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యూడు. పలు విఫలయుత్నాల తర్వాత 1897 జూలైలో వుుందుగా సేకరించిన లార్వా నుంచి ఇరవై ‘బ్రౌన్’ దోమలను పెంచగలిగాడు.

హుస్సేన్ ఖాన్ అనే మలేరియూ రోగి సాయంతో ఆ దోమలను ఇన్ఫెక్ట్ చేశాడు. ఇందుకు ఒక్కో దోవు తాగిన నెత్తుటికి ఎనిమిది అణాల చొప్పున ఆ రోగికి చెల్లించాడు. ఇన్ఫెక్ట్ చేసిన దోవుల నుంచి వులేరియూ పరాన్నజీవి కణాలను కనుగొని, ఈ విషయూన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ద్వారా 1897 డిసెంబర్ 18న ప్రపంచానికి వెల్లడించాడు. ఈ పరిశోధనలే రాస్‌కు 1902లో నోబెల్ బహువుతి తెచ్చిపెట్టారుు. అరుుతే, 1899లోనే అతడు ఇండియున్ మెడికల్ సర్వీస్‌కు రాజీనావూ చేసి, ఇంగ్లండ్‌కు వెళ్లిపోయూడు. రాస్‌కు గుర్తుగా ప్రభుత్వం హైదరాబాద్‌లో వులేరియూ పరిశోధనల కోసం రొనాల్డ్ రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది ఉస్మానియూ యుూనివర్సిటీ పరిధిలో పనిచేస్తోంది.
 - పన్యాల జగన్నాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement