ronald ras
-
పాలమూరుపై చెరగని ముద్ర
సాక్షి, మహబూబ్‌నగర్: పునరి్వభజన అనంతరం జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డి.రొనాల్డ్‌రోస్ చెరగని ముద్ర వేశారు. విస్తృత తనిఖీలతో ప్రభుత్వ విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యావ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మిషన్ కలాం పేరుతో ఎన్జీఓలను భాగస్వాములను చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానంతో సులువుగా అనుమతులు, ఫైళ్ల నిర్వహణతో పనిభారాన్ని తగ్గించగలిగారు. భూప్రక్షాళన ద్వారా జిల్లాలో పకడ్బందీగా భూరికార్డుల నవీకరణ చేపట్టారు. ప్రతీ సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’లో సమూల మార్పులు తీసుకొచ్చారు. వీడియో కాన్ఫరెన్సు కోసం అన్ని తహసీల్దార్ కార్యాలయాలను అనుసంధానం చేశారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రాజెక్టుల భూసేకరణ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో విలక్షణమైన పాలనతో మెరుగైన ఫలితాలు సాధించినందుకు దేశ, రాష్ట్ర స్థాయి అవార్డులు వరించాయి. మయూరి పార్కులో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్ (ఫైల్) జిల్లాకు అవార్డులు.. మహబూబ్‌నగర్ జ్లిలా వెబ్‌సైట్‌కు 2018 డిజిటల్ ఇండియా అవార్డ్స్‌లో భాగంగా వెబ్‌రత్న డిస్ట్రిక్ట్ అవార్డు వరించింది. పరిపాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానాన్ని తీసుకురావడం ద్వారా స్కోచ్ 2018, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు–2019 సాధించారు. వాటర్, శానిటేషన్, హైజీన్‌కు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నుంచి అవార్డు అందుకున్నారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ, శిక్షణకు సంబంధించి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు–2019 వరించింది. డిజిటల్ సేవల అనుసంధానం డిజిటల్ సేవలను జిల్లాలోని అన్ని శాఖలకు విస్తరించి మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ–ఆఫీస్ సేవలు, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ రూపకల్పన, ప్రతీ ప్రభుత్వ శాఖకు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణ వంటి వాటితో ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టారు. సాంకేతికపరమైన సేవలను వినియోగించుకుని ప్రభుత్వ పథకాల అమలును ప్రజలకు చేరువ చేయడంలో తనదైన శైలితో పాలన సాగించారు. ప్రజావాణి, సమాచారహక్కు చట్టం వంటి ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పించారు. మిషన్ భగీరథ పథకంపై సమీక్ష (ఫైల్) సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ.. జిల్లాలో శాసనసభ, పార్లమెంటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేస్తూ ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా రూపకల్పన చేయడంతో పాటు ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యతను చాటారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సంక్షేమంపై ప్రత్యేక దృష్టి దివ్యాంగుల సంక్షేమానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులకు ఉపాది కలి్పంచేందుకు దివ్యాంగుల సోలార్ సొసైటీని ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేశారు. చెవిటి, మూగ, దివ్యాంగుల పిల్లలకోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. స్త్రీ,శిశు సంక్షేమంలో భాగంగా మహబూబ్‌నగర్ అర్బన్‌లో అంగన్వాడీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు చర్యలు చేపట్టారు. మాతా శిశు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి బాల్యవివాహాల నివారణపై దృష్టి సారించారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా బాలకారి్మక వ్యవస్థ నిర్మూలకు చర్యలు చేపట్టారు. అభివృద్ధి పనుల్లో వేగం జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. మయూరి పార్కును రాష్ట్ర, దేశస్థాయి నాయకులు, అధికారులు సందర్శించేలా చర్యలు తీసుకున్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించగలిగారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో పురోగతిని వేగిరం చేశారు. సస్పెన్షన్లతో హడల్.. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిపాలనలో జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరుపై కఠనంగా వ్యవహరిస్తూ హడలెత్తించారు. విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో విధులపై నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలకు వెనుకాడలేదు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు, తదనంతరం పది రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడుగుంతలు, శ్వశానవాటిక, డంపింగ్ యార్డుల నిర్మాణం, కంపచెట్ల తొలగింపు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి నిర్వహణపై తగు చర్యలు తీసుకున్నారు. 24 గంటల్లో 380 మరుగుదొడ్లు స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా హన్వాడ మండలం సల్లోనిపల్లిలో కేవలం 24 గంటల్లోనే 380 మరుగుదొడ్లను నిర్మింపజేసి దేశ స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లాకు గుర్తింపును తెచ్చారు. నిరీ్ణత సమయానికంటే ముందే జిల్లాను వంద శాతం మలమూత్ర విసర్జన రహితంగా ప్రకటించారు. -
ఈవీఎంల హ్యాక్ అసాధ్యం
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని సీఈవో రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఇక్కడ ‘లోక్‌సభ జనరల్ ఎలక్షన్స్– మీడియా మానిటరింగ్ అండ్ మీడియా మేనేజ్మెంట్’అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈసీ నిబంధనల ప్రకారంగా ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి అంశాలకే యంత్రాంగం పరిమితమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఈసీ నియమించే ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు తమ పరిధిలోకి రారని, నేరుగా ఈసీకే వారు నివేదికలు అందజేస్తారని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అనుసరించాల్సిన పద్ధతుల గురించి జిల్లా ఎన్నికల అధికారులు దానకిషోర్(హైదరాబాద్), రోనాల్డ్‌రాస్(మహబూబ్‌నగర్), డీఎస్ లోకేష్‌కుమార్(రంగారెడ్డి), అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్ సీఈవోలు ఆమ్రపాలి, రవికిరణ్, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి వివరించారు. వీవీ ప్యాట్ స్లిప్స్‌కు ఐదేళ్ల భద్రత: రోనాల్డ్ రాస్ వీవీప్యాట్ స్లిప్పులను ఐదేళ్లపాటు భద్రపరిచే పద్ధతి ఉందని మహబూబ్‌నగర్ డీఈవో రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈవీఎంల సాంకేతికత, వాటి పనితీరు, భద్రతా ప్రమాణాల అంశాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోక్‌సభ ఎన్నికలకు కొత్తగా వచ్చే ఎం3 ఈవీఎంలు సాంకేతికంగా పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. పోలింగ్ రోజున క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే సదుపాయం కల్పించే క్రమంలో అర్ధరాత్రి 12 దాటితే ఎం3 ఈవీఎం క్లోజింగ్ బటన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుందన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని, దీనిపై ఈసీ బహిరంగ సవాల్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో విద్యావంతులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నా ఆశించిన మేరకు పోలింగ్ నమోదు కాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బోగస్ ఓట్ల నమోదుకు సంబంధించి విచారణ అంశాలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు. -
ఏమ్మా.. ఈ డబ్బు ఏం చేస్తావ్?
నవాబుపేట(జడ్చర్ల) : ఏమ్మా.. ఈ డబ్బులు ఏం చేస్తావ్... అని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వెళ్తున్న మహిళను ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు కలెక్టర్ రొనాల్డ్‌రోస్. నవాబుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బుధవారం రైతు బంధు చెక్కుల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వెళ్తున్న మహిళతో ఆయన మాట్లాడారు. లింగంపల్లికి చెందిన భారతమ్మ తనకు రూ.14వేలు వచ్చాయిని, ఈ డబ్బులను వ్యవసాయానికే ఉపయోగిస్తానని చెప్పడంతో అభినందించారు. ఈ మేరకు కలెక్టర్ తీగలపల్లి, రుద్రారం, సిద్దోటం గ్రామాల్లో చెక్కుల పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, బ్యాంకు అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, మండల స్పెషల్ అధికారి కొమురయ్య, మార్కెట్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నర్సింహులు, ఎంపీడీఓ సాయిలక్ష్మి, సర్పంచ్‌లు రుద్రారం లక్ష్మి, సిద్దోటం నర్సింహులు, వైస్ ఎంపీపీ నారాయణ, బాలకిష్టయ్య, మధు, యాదిరెడ్డి, కృష్ణ, సంతో‹ష్ పాల్గొన్నారు. అర్హులందరికీ చెక్కులు జడ్చర్ల : రైతుబంధు పథకం కింద అర్హులైన రైతులందరికీ చెక్కులు అందజేస్తామని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో జరిగిన రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివాదస్పద భూములు మినహా రైతులకు వంద శాతం చెక్కులు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఈనెల 18 నుండి ప్రతీ గ్రామంలో తమ సిబ్బంది పర్యటించి కోర్టు కేసులు మినహాయించి వివాదాల్లో ఉన్న భూముల విషయమై విచారించి ఆయా రైతులకు కూడా చెక్కులు అందేలా చూస్తామన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఏడీఏ నిర్మల, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జంగయ్య, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్ గోవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మలేరియా పనిపట్టిన మహావైద్యుడు
మలేరియా పనిపట్టిన మహావైద్యుడాయున. దోమల జీర్ణకోశంలో దాగిన మలేరియా పరాన్నజీవి ఆచూకీని కనుగొన్నాడు. ఆయున పరిశోధనల ఫలితంగా మలేరియా మహమ్మారి తాకిడి గణనీయంగా తగ్గింది. మలేరియాపై పరిశోధనలు ఆయునకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. ఆయునే సర్ రొనాల్డ్ రాస్. ఆయన పుట్టి పెరిగింది భారత్‌లోనే. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న అల్మోరాలో 1857 మే 13న పుట్టాడు. తండ్రి సర్ కాంప్‌బెల్ క్లే గ్రాంట్ రాస్ అప్పట్లో భారత్‌లోని బ్రిటిష్ సైన్యంలో జనరల్‌గా పనిచేసేవాడు. రొనాల్డ్‌ను ఎనిమిదో ఏటనే చదువు కోసం తండ్రి ఇంగ్లండ్‌కు పంపేశాడు. - రొనాల్డ్ రాస్ హైదరాబాదీ సౌతాంప్టన్ చేరువలోని స్ప్రింగ్‌హిల్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత లండన్ మెడికల్ కాలేజీలో, రాయుల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, రాయుల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియున్స్లో వైద్యశాస్త్రం చదువుకున్నాడు. పబ్లిక్ హెల్త్‌లో డిప్లొవూతో పాటు బ్యాక్టీరియూలజీ కోర్సునూ పూర్తి చేశాడు. వైద్యశాస్త్రానికి విస్తృతంగా అధ్యయునం చేసిన రొనాల్డ్ రాస్ ప్రతిభా పాటవాలు వైద్యరంగానికి వూత్రమే పరిమితం కాలేదు. స్ప్రింగ్‌హిల్ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న కాలంలోనే కవిత్వం, సంగీతం, గణితం, చిత్రకళలపై ఆసక్తి పెంచుకున్నాడు. పద్నాలుగేళ్ల వయుసులోనే గణిత శాస్త్రంలో బహువుతి అందుకున్నాడు. పదహారేళ్ల వయుసులో ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జి డ్రారుుంగ్ పరీక్షలో ప్రథవుుడిగా నిలిచాడు. విద్యార్థి దశలో కవిత్వ, నాటక రచన కొనసాగించడమే కాకుండా, పాటలకు స్వరకల్పన చేసేవాడు. సికింద్రాబాద్‌లోనే కీలక పరిశోధనలు... ఇంగ్లండ్‌లో చదువు పూర్తయ్యూక రొనాల్డ్ రాస్ 1881 సెప్టెంబర్ 22న భారత్ చేరుకున్నాడు. అప్పటి నుంచి 1894 వరకు ఇండియున్ మెడికల్ సర్వీస్ అధికారిగా వుద్రాసు, బర్మా, బెలూచిస్థాన్, అండవూన్ దీవులు, బెంగళూరు, సికింద్రాబాద్ సహా పలుచోట్ల పనిచేశాడు. బెంగళూరులో ఉండగానే ఆయున దోవుల వల్ల వ్యాపించే వ్యాధులపై దృష్టి సారించాడు. వుధ్యలో సెలవులపై సకుటుంబంగా లండన్ వెళ్లినప్పుడు 1894లో తన గురువు పాట్రిక్ వూన్సన్ను తొలిసారిగా కలుసుకున్నాడు. వులేరియూ పరిశోధనలో ఎదురయ్యే సవుస్యలను వూన్సన్ ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. వులేరియూపై పరిశోధనలకు భారతదేశమే అనువైన ప్రదేశవుని వూన్సన్ నవ్ముకంగా అతడికి చెప్పాడు. సెలవుల తర్వాత రాస్ 1895 వూర్చి 20న సికింద్రాబాద్‌లో దిగాడు. కస్టమ్స్ కార్యాలయుంలో లగేజీ క్లియుర్ కాకవుుందే, అక్కడి నుంచి నేరుగా బొంబారుు సివిల్ ఆస్పత్రికి చేరుకుని, వులేరియూ రోగుల రక్తపు నవుూనాల పరిశీలనకు ఉపక్రమించాడు. రెండు నెలల వ్యవధిలోనే దోవుల జీర్ణకోశంలో వులేరియూ పరాన్నజీవి తొలి దశలను గుర్తించాడు. ఈలోగా బెంగళూరులో కలరా విజృంభించింది. రాస్‌ను అక్కడకు బదిలీ చేయుడంతో అతడి వులేరియూ పరిశోధనలకు అంతరాయుం కలిగింది. బెంగళూరులో వులేరియూ కేసులు పెద్దగా ఉండేవి కావు. ఈ పరిస్థితికి కలత చెంది ‘నన్నో వుూలకు విసిరేశారు. ఇక్కడ నాకు పనేం లేదు’ అంటూ వూన్సన్కు లేఖ రాశాడు. అరుుతే, 1896 మేలో తిరిగి సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యూడు. పలు విఫలయుత్నాల తర్వాత 1897 జూలైలో వుుందుగా సేకరించిన లార్వా నుంచి ఇరవై ‘బ్రౌన్’ దోమలను పెంచగలిగాడు. హుస్సేన్ ఖాన్ అనే మలేరియూ రోగి సాయంతో ఆ దోమలను ఇన్ఫెక్ట్ చేశాడు. ఇందుకు ఒక్కో దోవు తాగిన నెత్తుటికి ఎనిమిది అణాల చొప్పున ఆ రోగికి చెల్లించాడు. ఇన్ఫెక్ట్ చేసిన దోవుల నుంచి వులేరియూ పరాన్నజీవి కణాలను కనుగొని, ఈ విషయూన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ద్వారా 1897 డిసెంబర్ 18న ప్రపంచానికి వెల్లడించాడు. ఈ పరిశోధనలే రాస్కు 1902లో నోబెల్ బహువుతి తెచ్చిపెట్టారుు. అరుుతే, 1899లోనే అతడు ఇండియున్ మెడికల్ సర్వీస్‌కు రాజీనావూ చేసి, ఇంగ్లండ్‌కు వెళ్లిపోయూడు. రాస్కు గుర్తుగా ప్రభుత్వం హైదరాబాద్‌లో వులేరియూ పరిశోధనల కోసం రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది ఉస్మానియూ యుూనివర్సిటీ పరిధిలో పనిచేస్తోంది. - పన్యాల జగన్నాథదాసు -
ఆంధ్రకు రాస్.. మనకు ఎవరో బాస్
ఇందూరుకు కొత్త కలెక్టర్ ఎవరనేది మళ్లీ చర్చనీయాంశంగా మారింది. పీఎస్ ప్రద్యుమ్న బదిలీ జరిగిన 43 రోజులకు జూలై 30న యువ ఐఏ ఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌ను ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా మంచి పేరు సంపాదించిన ఆయనను జిల్లా కలెక్టర్‌గా నియమించడంపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షం వ్యక్తమైంది. నెల కూడా తిరగక ముందే, ఆయన బదిలీ అనివార్యం కావడంతో కథ మొదటికి వచ్చింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రొనాల్డ్ రాస్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి న మరుసటి రోజే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ మొదలు సీఎం పర్యటన, సమగ్ర కుటుంబ సర్వే వరకు చురుగ్గా పాల్గొని సీఎం ప్రశంసలు అందుకున్నారు. పాల నపై పట్టు సాధిస్తున్న క్రమంలోనే, ఐఏఎస్ అధికారుల విభజనలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. సెప్టెం బర్ ఒకటి లోగా రొనాల్డ్‌రాస్ ఆ రాష్ట్రం లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే ల క్ష్యంగా పని చేస్తూ, కొద్ది రోజులలోనే డై నమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆ యన పాలన జిల్లా ప్రజలకు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారనుంది. రొనాల్డ్‌రాస్ బదిలీ అనివార్యంగా మారడంతో కొత్త కలెక్టర్‌గా ఎవరు రాబోతున్నారనే చర్చ మొదలైంది. తెరపైకి మళ్లీ రఘునందన్ పేరు జూన్ 17న పీఎస్ ప్రద్యుమ్నను బదిలీ చేసిన ప్రభుత్వం 43 రోజుల తరువాత జిల్లాకు కొత్త కలెక్టర్‌గా రొనాల్డ్‌రాస్‌ను నియమించింది. అప్పటివరకు జేసీగా ఉన్న డి.వెంకటేశ్వర్రావు ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. రొనాల్డ్‌రాస్ నియామకం తరువాత, జేసీ వెంకటేశ్వర్రావు కూడా బదిలీ అయ్యారు. ఆయన కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోగా, ఆయ న స్థానంలో కూడా ఎవరినీ నియమిం చలేదు. అయితే, శుక్రవారం జరిగిన అ నూహ్య పరిణామాల నేపథ్యంలో రోనాల్డ్ బదిలీ అనివార్యం కావడంతో ఆయన స్థానంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్ రావు పేరు తాజాగా ప్ర ముఖంగా వినిపిస్తోంది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేసిన గిరిజా శంకర్, మరో ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఐఏఎస్‌ల కే టాయింపుతో ప్రచారంలోకి వచ్చిన ఈ ముగ్గురిలో ఒకరినీ నియమిస్తారా? లేక కొత్త పేర్లు తెరపైకి వస్తాయా? కలెక్టర్ నియామకం ఎప్పు డు జరుగుతుంది? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తుంది. కాగా, జేసీగా పనిచేస్తూ జులై 30న బదిలీ అయిన డి.వెంకటేశ్వర్రావును మళ్లీ జేసీగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం కూడ జరుగుతోంది. రాస్ కోరుకుంటే ఒకవేళ రొనాల్డ్‌రాస్ ఇక్కడే కొనసాగ డానికి సుముఖంగా ఉంటే, ఆయనను తమకు కేటాయించాలని తెలంగాణ ప్ర భుత్వం ఆంధ్ర సర్కారును కోరే అవకా శం ఉంది.అప్పుడు రాస్ ఇక్కడే కలెక్టర్ గా కొనసాగుతారని భావించవచ్చు. -
చెల్లింపునకు నేడే ఆఖరి గడువు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఆస్తిపన్ను చెల్లింపునకు ఈ నెల 31వ తేదీయే ఆఖరి గడువని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (రెవెన్యూ) హరికృష్ణ, అదనపు కమిషనర్ (ప్లానింగ్) వెంకట్రామిరెడ్డి, సెంట్రల్ జోనల్ కమిషనర్ రోనాల్డ్‌రాస్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడువు ముగిసే సమయానికి రూ. 1100 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ. 895 కోట్ల పన్ను వసూలు చేశామన్నారు. ఉగాది రోజున సోమవారం రాత్రి 8 గంటల వరకు కూడా పన్ను చెల్లించవచ్చని, ఆన్లైన్లో కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు. సమావేశంలో సర్కిల్-10 డీఎంసీ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.