ఆంధ్రకు రాస్.. మనకు ఎవరో బాస్
ఇందూరుకు కొత్త కలెక్టర్ ఎవరనేది మళ్లీ చర్చనీయాంశంగా మారింది. పీఎస్ ప్రద్యుమ్న బదిలీ జరిగిన 43 రోజులకు జూలై 30న యువ ఐఏ ఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌ను ప్రభుత్వం నియమించింది. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా మంచి పేరు సంపాదించిన ఆయనను జిల్లా కలెక్టర్‌గా నియమించడంపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షం వ్యక్తమైంది. నెల కూడా తిరగక ముందే, ఆయన బదిలీ అనివార్యం కావడంతో కథ మొదటికి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రొనాల్డ్ రాస్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి న మరుసటి రోజే హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన కలెక్టర్‌ల సమావేశంలో పాల్గొన్నారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ మొదలు సీఎం పర్యటన, సమగ్ర కుటుంబ సర్వే వరకు చురుగ్గా పాల్గొని సీఎం ప్రశంసలు అందుకున్నారు. పాల నపై పట్టు సాధిస్తున్న క్రమంలోనే, ఐఏఎస్ అధికారుల విభజనలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
సెప్టెం బర్ ఒకటి లోగా రొనాల్డ్‌రాస్ ఆ రాష్ట్రం లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే ల క్ష్యంగా పని చేస్తూ, కొద్ది రోజులలోనే డై నమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆ యన పాలన జిల్లా ప్రజలకు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారనుంది. రొనాల్డ్‌రాస్ బదిలీ అనివార్యంగా మారడంతో కొత్త కలెక్టర్‌గా ఎవరు రాబోతున్నారనే చర్చ మొదలైంది.
తెరపైకి మళ్లీ రఘునందన్ పేరు
జూన్ 17న పీఎస్ ప్రద్యుమ్నను బదిలీ చేసిన ప్రభుత్వం 43 రోజుల తరువాత జిల్లాకు కొత్త కలెక్టర్‌గా రొనాల్డ్‌రాస్‌ను నియమించింది. అప్పటివరకు జేసీగా ఉన్న డి.వెంకటేశ్వర్‌రావు ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. రొనాల్డ్‌రాస్ నియామకం తరువాత, జేసీ వెంకటేశ్వర్‌రావు కూడా బదిలీ అయ్యారు. ఆయన కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోగా, ఆయ న స్థానంలో కూడా ఎవరినీ నియమిం చలేదు. అయితే, శుక్రవారం జరిగిన అ నూహ్య పరిణామాల నేపథ్యంలో రోనాల్డ్ బదిలీ అనివార్యం కావడంతో ఆయన స్థానంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న రఘునందన్ రావు పేరు తాజాగా ప్ర ముఖంగా వినిపిస్తోంది.
మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేసిన గిరిజా శంకర్, మరో ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఐఏఎస్‌ల కే టాయింపుతో ప్రచారంలోకి వచ్చిన ఈ ముగ్గురిలో ఒకరినీ నియమిస్తారా? లేక కొత్త పేర్లు తెరపైకి వస్తాయా? కలెక్టర్ నియామకం ఎప్పు డు జరుగుతుంది? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తుంది. కాగా, జేసీగా పనిచేస్తూ జులై 30న బదిలీ అయిన డి.వెంకటేశ్వర్‌రావును మళ్లీ జేసీగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం కూడ జరుగుతోంది.
రాస్ కోరుకుంటే
ఒకవేళ రొనాల్డ్‌రాస్ ఇక్కడే కొనసాగ డానికి సుముఖంగా ఉంటే, ఆయనను తమకు కేటాయించాలని తెలంగాణ ప్ర భుత్వం ఆంధ్ర సర్కారును కోరే అవకా శం ఉంది.అప్పుడు రాస్ ఇక్కడే కలెక్టర్ గా కొనసాగుతారని భావించవచ్చు.