కోదాడ పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం.ముఠా సభ్యులను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో వీరి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.