రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం | road accident control | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం

Jun 14 2017 11:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం - Sakshi

రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఎస్పీ అధ్యక్షతన జాతీయ రహదారుల పరిధిలో ఉన్న పోలీస్‌ అధికారులకు ఐటీకోర్‌పై అవగాహన, శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే ప్రత్యేక సర్వే బృందాలతో అధ్యయనం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీ నండూరు సాంబశివరావు ఉ

కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) :
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఎస్పీ అధ్యక్షతన జాతీయ రహదారుల పరిధిలో ఉన్న పోలీస్‌ అధికారులకు ఐటీకోర్‌పై అవగాహన, శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే ప్రత్యేక సర్వే బృందాలతో అధ్యయనం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీ నండూరు సాంబశివరావు ఉత్తర్వుల మేరకు ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9,10వ తేదీల్లో విశాఖపట్టణంలో వర్క్‌షాపు నిర్వహించి, రోడ్డు సేఫ్టీ యాప్‌ను ఆవిష్కరించారని చెప్పారు. ఎక్కడ అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయో ఈ యాప్‌ వల్ల తెలుస్తుందని, తద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ–2 సుంకర మురళీమోహన్‌ నోడల్‌ అధికారిగా నియమితులైనట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ కోర్‌పై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దామోదర్, ట్రాఫిక్‌ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఎస్‌బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, డీసీఆర్‌బీ సీఐ కృష్ణారావు, సీఐ సుధాకర్, ఎన్‌హెచ్‌–16 పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement