బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్కల బెడదపై దృష్టి సారించి, అత్యంత ప్రమాదకరమైన శునకజాతిపై నిషేధం విధించారు. బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్క కాట్లను నివారించేందుకు రుషి సునాక్ అమెరికన్ ఎక్స్‌ఎల్ బులీ జాతికి చెందిన కుక్కల పెంపకంపై నిషేధం విధించారు.
ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ అమెరికన్ ఎక్స్‌ఎల్ బులీ డాగ్స్ మనుషులకు ప్రమాదకరంగా పరిణమించాయని, ముఖ్యంగా ఇవి చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. ఈ తరహా కుక్కలు దాడులకు పాల్పడటానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన షేర్ చేశారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన శునకాలతో సమస్య లేదని, అయితే ఎక్స్‌ఎల్ బులీ డాగ్స్ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేమన్నారు.
బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్కల బెడద నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలియజేశారు. ఇటీవల జరిగిన దాడులకు కారణంగా నిలిచిన కుక్కల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామన్నారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని తెలిపారు. కాగా ఇటీవల స్టాఫోర్డ్‌షైర్‌లో ఎక్స్‌ఎల్ బులీ జాతి శునకం ఒక వ్యక్తిపై దాడి చేయగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికిముందు 11 ఏళ్ల చిన్నారిపై ఇదేవిధమైన దాడి జరిగింది. కాగా ఎక్స్‌ఎల్ బులీ అనేది అమెరికన్ పిట్‌బుల్ టెరియర్స్- అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెరియర్స్‌ల క్రాస్ బ్రీడ్.
ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం?
It’s clear the American XL Bully dog is a danger to our communities.
— Rishi Sunak (@RishiSunak) September 15, 2023
I’ve ordered urgent work to define and ban this breed so we can end these violent attacks and keep people safe. pic.twitter.com/Qlxwme2UPQ
Comments
Please login to add a commentAdd a comment