
ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేటి (శనివారం)ఉదయం 10 గంటల సమయంలో భక్తులతో నిండిన ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి పటియాలీ-దరియావ్‌గంజ్ రహదారిలోని చెరువులో పడింది. అనంతరం అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడినవారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులతోపాటు పరిపాలన విభాగానికి చెందిన అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. పాటియాలీలోని సీహెచ్‌సీలో ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు మృతి చెందారని సీఎంఓ డాక్టర్ రాజీవ్ అగర్వాల్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment