ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 18,32,950 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 4,077 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 2,70,284 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 3,62,437 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,07,95,335 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది.
దేశంలో ప్రస్తుతం 36,18,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.22 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. దేశంలో ఇప్పటివరకు 31,48,50,143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి:
Black Fungus: బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది
'కోవిడ్‌పై ప్రభుత్వ విధానం వినాశకరం'
Comments
Please login to add a commentAdd a comment