
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గత 24 గంటల్లో 60,753 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,60,019గా ఉంది. మరో 1,647 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,85,137కు పెరిగింది. రికవరీ రేటు 96.16 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 2.98 శాతంగా నమోదైంది. గత 24 గంటలలో 97,743 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య దాదాపు 39 కోట్లకు చేరువైంది. రికవరీల సంఖ్య 2,86,78,390కి పెరిగింది. ఇప్పటి వరకూ 27,23,88,783 డోసుల టీకాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment