సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 91,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 18,285 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 24,105 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 14 లక్షల 24 వేల 859 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో 15, ప.గో.జిల్లాలో 14, విజయనగరం జిల్లాలో 9.. అనంతపురం, తూ.గో, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో 8 మంది, కర్నూలు జిల్లాలో ఆరుగురు.. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు చొప్పున 99 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 10427 మంది మరణించారు.
గత 24 గంటల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళం- 1207, విజయనగరం- 639, విశాఖ- 1800, తూ.గో- 3296, ప.గో- 1664, కృష్ణా- 652, గుంటూరు- 1211, ప్రకాశం- 1056, నెల్లూరు- 1159, చిత్తూరు- 1822, అనంతపురం- 1876, కర్నూలు- 1026, వైఎస్ఆర్ జిల్లా- 877 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 1,88,40,321 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి: ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి
డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అసమానం : సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment