దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు వేల సంఖ‍్యలో నమోదు అవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు, మరణాల రేటు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో 16,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో వైరస్ కారణంగా మరో 31 మంది మృతిచెందారు. కాగా, ప్రస్తుతం దేశంలో 1,11,711 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 13,929 బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 4,35,02,429కి చేరాయి. ఇందులో 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,199 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉంది. ఇక మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
#COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours.
— ANI (@ANI) July 3, 2022
Active cases 1,11,711
Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX
Comments
Please login to add a commentAdd a comment