
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో మరోసారి పెరగడం ఆందోళనకు కలిగిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,82,315 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య.. అమెరికాలో రోజువారీగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. గత 24 గంటల్లో 3780 మంది రోగులు మరణించారు.
దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 2,26,188కు చేరింది. అదే సమయంలో గత 24 గంటల్లో దేశంలో 3,38,439 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,69,51,731 కు పెరిగింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 34,87,229కు చేరుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 16,04,94,188 వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 17,02,42,410 డోసులు ఉచితంగా అందించింది.
Comments
Please login to add a commentAdd a comment