న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కరోనా కేసులు సంఖ్య 3,99,778 కు చేరింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 366 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,39,895కు చేరింది. కేరళ రాష్ట్రంలో గురువారం 32,097 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 188 మంది మరణించారు. గత 24 గంటల్లో 34,791 మంది కరోనా నుంచి రికవరీ కాగా , మొత్తం రికవరీల సంఖ్య 3,20,63,616 కి పెరిగింది. రికవరీ రేటు 97.45% శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.72% శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 81.09 లక్షల టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటిదాకా 67.09 కోట్ల టీకాలు ఇవ్వడం పూర్తయింది.
చదవండి: మౌనిక ఆత్మహత్య కేసు: ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
Comments
Please login to add a commentAdd a comment