
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 608 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో కరోనా నుంచి 459 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా మరణాలు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.
ఇక, ఇప్పటి వరకు తెలంగాణలో 8,05,137 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు 7,95,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా బులిటెన్ ప్రకారం.. హైదరాబాద్ 329, మేడ్చల్ మల్కాజ్‌గిరి 54, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 5, జగిత్యాల 6, జనగామ 7, గద్వాల 1 , కరీంనగర్ 10, ఖమ్మం 11, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 4, మంచిర్యాల 5, మెదక్ 1 , నాగర్ కర్నూల్ 2, నల్గొండ 7, నారాయణపేట్ 4, నిజామాబాద్ 10, పెద్దపల్లి 12, సిరిసిల్ల 4, రంగారెడ్డి 67, సంగారెడ్డి 16, సిద్దిపేట 6, వికారాబాద్ 7, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, హనుమకొండ 2, యాదాద్రి 6 చొప్పున నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) July 8, 2022
(Dated.08.07.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/VwoZEmewKJ
Comments
Please login to add a commentAdd a comment