సాక్షి, ఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కేసులు తగ్గాయి. మూడు లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,73,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది.
గత 24 గంటల్లో కరోనా బారినపడి 4,106 మంది మృతి చెందగా, ఇప్పటివరకు ఇప్పటివరకు 2,74,390 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,78,741 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,11,74,076 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.29 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఇప్పటివరకు దేశంలో 31,64,23,658 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి: 16.98%కి పాజిటివిటీ రేటు
ఖైదీలను వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి
Comments
Please login to add a commentAdd a comment