సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 42,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,12,16,337కు చేరింది. దేశంలో కొత్తగా 3,998 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా.. ఇప్పటివరకు 4,18,480మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,07,170 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనానుంచి ఇప్పటివరకు 3,03,90,687మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 41,54,72,455 మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment