4 Lakh Covid Cases In India: New Covid Cases In India In Last 24 Hours- Sakshi
Sakshi News home page

కరోనా విశ్వరూపం: మరోసారి 4 లక్షలు దాటిన రోజువారీ కేసులు

Published Thu, May 6 2021 10:04 AM | Last Updated on Fri, May 7 2021 10:41 AM

Corona In India: New 412262 Cases Reported In A Day - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ విరుచుకుపడుతోంది. కోవిడ్‌ కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోసారి దేశంలో కొత్త కేసులు నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 4,12,262 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 3,980 మంది మృత్యువాతపడ్డారు.

ఒకేరోజే 3,29,113 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410కు చేరాయి. మృతుల సంఖ్య 2,30,168కు పెరిగింది. ప్రస్తుతం 35,66,398 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 16,25,13,339 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

చదవండి: కేంద్ర మాజీ మంత్రి అజిత్‌ సిం‍గ్‌ కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement