దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కరోనా నుంచి 10,972 మంది కోలుకున్నారు.
ఇక, దేశవ్యాప్తంగా 84వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 400లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#COVID19 | India reports 13,313 fresh cases, 10,972 recoveries and 38 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 23, 2022
Active cases 83,990
Daily positivity rate 2.03% pic.twitter.com/u8Q2WhlI3w
ఇది కూడా చదవండి: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
Comments
Please login to add a commentAdd a comment