దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,528 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, అదే సమయంలో కరోనాతో 49 మంది మృతిచెందారు.దీంతో, దేశంలో ఇప్పటికి వరకు నమోదైన పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 4,37,50,599కి చేరగా.. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5,25,709 మందికి చేరుకుంది.
ఇదిలా ఉండగా.. దేశంలో ప్రస్తుతం 1,43,449 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్‌లో పేర్కొంది. కాగా, కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. వయోజన జనాభాలో 98 శాతం మంది మొదటి డోసు టీకాను తీసుకున్నట్టు తెలిపింది. ఇక, శనివారం ఒక్కరోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్ చేశారు.
COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449
— ANI (@ANI) July 17, 2022
199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. అసమానంగా కృషిచేసి ఈ రికార్డును అందుకోవడం గర్వకారణం. ఇది కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM
— Narendra Modi (@narendramodi) July 17, 2022
Comments
Please login to add a commentAdd a comment