
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంబిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 56 మంది వైరస్‌కు బలయ్యారు. మరో 1,231 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 49వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. ప్రస్తుతం 13,433 యాక్టివ్ కేసులున్నాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.53 శాతానికి పెరిగింది. రివకరీరేటు 98.76 ఉంది. కాగా ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య దడ పుట్టిస్తోంది. కొత్తగా వెయ్యికి పైగా కేసులు వెలుగు చేశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై మాస్క్‌ను తప్పనిసరీ చేసింది. మాస్క్ ధరించని వారి నుంచి 5వందల ఫైన్ విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
చదవండి: కరోనా విజృంభణ.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment